Swetha
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన పరీక్షలలో ఒకటి సివిల్స్. దీనిని సాధించడం కోసం ఎంతో మంది పగలు రాత్రి కస్టపడుతూ ఉంటారు. అయితే తాజాగా.. ఐఏఎస్ ల జీతం గురించి ఒక సీఏ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన పరీక్షలలో ఒకటి సివిల్స్. దీనిని సాధించడం కోసం ఎంతో మంది పగలు రాత్రి కస్టపడుతూ ఉంటారు. అయితే తాజాగా.. ఐఏఎస్ ల జీతం గురించి ఒక సీఏ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
దేశంలోనే అతి కష్టమైన , ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటి సివిల్స్, ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడం కోసం ఎంతో మంది యువత కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే సివిల్స్ పాస్ అయ్యి ఆ అధికారాన్ని చేపడితే దానికి దక్కే గౌరవమే వేరు. ఇప్పటివరకు ఐఏఎస్ సాధించిన ఎంతో మంది యువతకు సంబంధించిన వార్తల గురించి వింటూనే ఉన్నాము. వారు మిగిలిన వారికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తారని కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. చాలా మంది ఐఏఎస్ అవ్వడం కోసం వారికీ ఉన్న మంచి ఉద్యోగాలను సైతం వదులుకున్న వారు కూడా ఉన్నారు. ఐఏఎస్ లకు వచ్చే జీతం తక్కువే అయినా కూడా.. ఆ గౌరవం, మర్యాద, అధికారం కోసం సివిల్స్ వైపు అడుగులు వేసే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలో ఐఏఎస్ ల జీతం గురించి ఒక సీఏ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఐఏఎస్ లకు వచ్చే జీతం తక్కువని తెలిసినా కూడా.. యువత అంతా ఎందుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారో అర్థంకావడం లేదు అంటూ.. ముంబైకు చెందిన చిరాగ్ చౌహన్ అనే సీఏ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ఆయన ఐఏఎస్ ఆఫీసర్లకు వచ్చే జీతాలను, సీఏలకు వచ్చే జీతాలను పోల్చారు. ఐఏఎస్ అధికారుల జీతం.. సీఏ ఉద్యోగులకు ఆరంభంలో వచ్చే జీతంతో సమానం అంటూ చెప్పుకొచ్చారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది.. “2024 నోటిఫికేషన్ ప్రకారం ఐఏఎస్ అధికారి నెల జీతం (అన్నీ కలుపుకుని) రూ.56,000 నుంచి రూ.1,50,000. అత్యధిక వేతనం (క్యాబినెట్ సెక్రెటరీ) రూ.2,50,000. శిక్షణలో రెండేళ్లు నెలకు రూ.56,000 స్టయిపెండ్. టీఏ, డీఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి.. ఇది సీఏల సగటు ప్రారంభం వేతనంతో సమానం.. ఇంత తక్కువ వేతనం వచ్చినా ఐఏఎస్ ఎందుకు కావాలనుకుటారో” అంటూ రాసుకొచ్చాడు. దీనితో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, షేర్స్ తో వైరల్ అయిపోతుంది.
ఈ పోస్ట్ పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఐఏఎస్ అనేది డబ్బుల కోసం కాదని.. ఆ స్థానానికి గౌరవం, అధికారం, ప్రజలకు సేవ చేయాలనే ఆశయం కోసం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. దేశంలో సివిల్స్ అర్హత సాధించే వారి సంఖ్య సీఏ పరీక్షలో క్వాలిఫై అయ్యే వారి కంటే తక్కువేనని.. ఎవరికీ ఏది ఆసక్తి ఉంటుందో ఆ వృత్తిలో కొనసాగాలనుకుంటారని.. దానికి జీతంతో సంబంధం లేదని.. మరొక నెటిజన్ కామెంట్స్ చేశాడు. ఏదేమైనా అటు సీఏ సాధించడం కూడా అంత సులభతరమైనది కాదు. దాని కోసం కూడా ఏళ్ళ తరబడి కష్టపడే వారు ఎంతో మంది ఉంటారు. ఎవరి ఆసక్తిని బట్టి.. ఎవరి లక్ష్యాల దిశగా వారు అడుగులు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.