iDreamPost
android-app
ios-app

వింత ఘటన: వారం వ్యవధిలో రెండు సార్లు ప్రసవించిన గేదె

  • Published Jan 18, 2024 | 4:01 PM Updated Updated Jan 18, 2024 | 6:17 PM

ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో కొన్ని వింతలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే అలాంటి వింతలు కేవలం మనుషులలో, ప్రకృతిలోనే కాకుండా జంతువులలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఓ సంఘటనే బెంగుళూరులోని చిక్కమంగుళూరులో చోటు చేసుకుంది.

ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో కొన్ని వింతలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే అలాంటి వింతలు కేవలం మనుషులలో, ప్రకృతిలోనే కాకుండా జంతువులలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఓ సంఘటనే బెంగుళూరులోని చిక్కమంగుళూరులో చోటు చేసుకుంది.

  • Published Jan 18, 2024 | 4:01 PMUpdated Jan 18, 2024 | 6:17 PM
వింత ఘటన:  వారం వ్యవధిలో రెండు సార్లు ప్రసవించిన గేదె

సాధారణంగా అప్పుడపుడు ప్రకృతిలో కొన్ని వింతలు చోటు చేసుకుని.. మనుషులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలానే ఇదే ప్రకృతిలో ఉండే కొంతమంది మనుషులు కూడా.. కొన్ని సార్లు కొత్త అద్భుతాలు సృష్టించి లేదా సహజంగానో కొన్ని వింతలతో అందరిని ఆశ్చర్యపరుస్తారు. ఇప్పుడు తాజాగా జంతువులు కూడా వింతలు సృష్టించి ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రకృతి చర్యలలో భాగంగా ఒక జీవి మరొక జీవికి జన్మని ఇవ్వడం సహజం. అలానే చిక్కమంగుళూరులోని ఓ రైతు ఇంట్లో ఉన్న గేదె ఇటీవల ఓ దూడకు జన్మనిచ్చింది. ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమి లేదు. కానీ, అదే గేదె సరిగ్గా వారం రోజుల్లోనే మరొక దూడకు జన్మనిచ్చింది. దీనితో దాని యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఈ వింత ఆ పరిసర ప్రాంత ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ చుట్టు ప్రక్కల వారు ఈ వింతను చూసేందుకు బారులు తీరుతున్నారు.

ఈ వింత ఘటన చిక్కమంగళూరు జిల్లా ఎన్‌ఆర్‌ పురా తాలూకా శంకర్‌పూర్‌లో చోటుచేసుకుంది. హలియూరుకు చెందిన సుధాకర్ గౌడ్ అనే రైతు శంకర్ పూర్ సమీపంలోని మదుబా రోడ్డులో నివాసితున్నాడు. అయితే, ఈ రైతు ఎన్నో ఏళ్లుగా పశువులను పెంచుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఈ రైతు వద్ద ఉన్న ఒక గేదె.. మగ దూడకు జన్మనిచ్చింది. అంతా బాగానే  సాగుతున్న సమయంలో తాజాగా అదే గేదె మరొక దూడకు జన్మనిచ్చింది. ఎటువంటి సూచనలు లేకుండా ఇలా వారం రోజుల వ్యవధిలో అదే గేదె  మగ దూడకు జన్మనివ్వడం చూసి.. ఆ రైతు ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఇప్పుడు ఆ గేదెకు రెండు దూడలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇలా వారం రోజులలోనే రెండు దూడలకు జన్మనివ్వడంతో.. అందరికి ఇదెలా సాధ్యం అనే ప్రశ్న తలెత్తింది. దానితో పాటు ఇదొక వింత చర్యగా భావించి ఆ చుట్టు ప్రక్కల ప్రజలు.. దీనిని చూసేందుకు వస్తున్నారు.

ఈ విషయమై గేదె యజమాని రైతు సుధాకర్‌ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పశువుల పెంపకం చేస్తున్నానని, ఇలాంటి వింత సంఘటన మాత్రం జరిగింది ఇదే మొదటిసారి అని అన్నాడు. సాధారణంగా, ఆవులు, గేదెలు కవల పిల్లలకు జన్మను ఇచ్చేటట్లైతే.. అదే రోజున ప్రసవిస్తుంది. కానీ, ఈ గేదె ఒక దూడకు జన్మనిచ్చి ఎనిమిది రోజుల తర్వాత మరో దూడకు జన్మనిచ్చింది. గేదెలకు కృత్రిమ గర్భధారణ కూడా చేయడం లేదని. ప్రస్తుతం ఈ విషయాన్ని పశుసంవర్థక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. ఇక, రెండు దూడలు, ఆ గేదె కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీనితో ఈ వింత సంఘటన ఆ నోటా ఈ నోటా పాకి సామజిక మాధ్యమం వరకు చేరింది. సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.