iDreamPost
android-app
ios-app

40 మంది మత్స్యకారులతో ఉన్న బోటు గల్లంతు

40 మంది మత్స్యకారులతో బయలుదేరిన ఓ బోటు గల్లంతు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని ఆచూకి కోసం కోస్టల్ గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు.

40 మంది మత్స్యకారులతో బయలుదేరిన ఓ బోటు గల్లంతు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని ఆచూకి కోసం కోస్టల్ గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు.

40 మంది మత్స్యకారులతో ఉన్న బోటు గల్లంతు

కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 40 మంది మత్స్యకారులతో బయలుదేరిన ఓ బోటు గల్లంతు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకుని కొందరు వ్యక్తులు కోస్టల్ గార్డులకు సమాచారం అందించారు. అప్రమత్తమై కనిపించకుండాపోయిన ఆ బోటు ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే, ఆ బోటులో దాదాపు 40 మంది మత్స్యకారులు ఉండడంతో వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు షాక్ కు గురవుతున్నారు. గల్లంతైన బోటు ఆచూకిని వెంటనే కనిపెట్టాలని వేడుకుంటున్నారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గావా రాజధాని ఫనాజి నుంచి ఇటీవల 40 మంది మత్స్యకారులతో కూడిన ఓ బోటు బయలుదేరింది. అయితే, ఉన్నట్టుండి ఇది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కర్వార్ సమీపంలోని అరేబియా సముద్రంలో గల్లంతు అయింది. చివరగా ఈ బోటు సిగ్నల్ బెలికేరి జీపీఎస్ సిగ్నల్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి ఆ బోటు కనిపించలేదు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 40 మందితో కూడిన ఈ బోటు ఆచూకి కోసం కోస్టల్ గార్డులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకుని మత్స్యకారుల కుటుంబ సభ్యులు షాక్ కు గురవుతున్నారు. గల్లంతైన బోటు ఆచూకిని వెంటనే కనిపెట్టాలని వారు వేడుకుంటున్నారు. అయితే, ఆ బోటు ఇంజిన్ లో సాంకేతిక సమస్యల కారణంతో పాటు బలమైన గాలులు వీస్తుండడంతో ఆ బోటు కొట్టుకుని పోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి 40 మత్స్యకారులు ఉన్న ఆ బోటు గల్లంతు అవ్వడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. వెంటనే ఆ గల్లంతు అయిన ఆ బోటు ఆచూకిని కనిపెట్టాలని కోరుతున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి