iDreamPost
android-app
ios-app

భార్య వేధింపులకు పారిపోయిన టెకీ.. జైల్లో అయినా ఉంటా, ఇంటికి వెళ్లనంటూ!

  • Published Aug 17, 2024 | 1:46 PM Updated Updated Aug 17, 2024 | 1:46 PM

ఇప్పటి వరకు దాంపత్య జీవితంలో గొడవల కారణం చాలామంది మహిళలు తమ భర్తలు పెట్టే వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం, వారి నుంచి విడిపోవడం, ఇల్లు వదిలి భర్త పై ఫిర్యాదు చేయడం వంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. కానీ, మొదటిసారి ఓ భర్త తన భర్య పెట్టిన వేధింపులు భరించలేక పారిపోయాడు. అంతేకాకుండా.. జైల్లో పెట్టండి కానీ, ఇంటికి మాత్రం రాను అంటూ వాపోయాడు. ఇంతకీ ఎక్కడంటే..

ఇప్పటి వరకు దాంపత్య జీవితంలో గొడవల కారణం చాలామంది మహిళలు తమ భర్తలు పెట్టే వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం, వారి నుంచి విడిపోవడం, ఇల్లు వదిలి భర్త పై ఫిర్యాదు చేయడం వంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. కానీ, మొదటిసారి ఓ భర్త తన భర్య పెట్టిన వేధింపులు భరించలేక పారిపోయాడు. అంతేకాకుండా.. జైల్లో పెట్టండి కానీ, ఇంటికి మాత్రం రాను అంటూ వాపోయాడు. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 17, 2024 | 1:46 PMUpdated Aug 17, 2024 | 1:46 PM
భార్య వేధింపులకు పారిపోయిన టెకీ.. జైల్లో అయినా ఉంటా, ఇంటికి  వెళ్లనంటూ!

సాధారణంగా ఏ భార్య భర్తల మధ్యనైనా గొడవలనేవి సహజం. అసలు వైవాహిక జీవితం గొడవపడని భార్య భర్తలు అంటూ ఎవ్వరూ ఉండారు. ఏదో ఒక కారణంతో మాటకు మాట ఆరోపణలు చేసుకోవడం, కోపం తగ్గక అంతా మార్చిపోయి ముందకు సాగడమే దాంపత్య జీవితానికి అర్ధం. కానీ, నేటి కాలంలో చాలామంది భర్య, భర్తలు చిన్న చిన్న కారణాలకే ఈగోలు చూపించడమే తప్పా అర్ధం చేసుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరిలోనూ లేదు. పైగా హూ.. అంటే విడాకులంటూ కోర్టు మెట్లు ఎక్కి విడిపోతున్నరే తప్పా, ఏ ఒక్కరు కూడా సర్దుకుపోవాలనే ఆలోచన చేయడం లేదు.

ఇలా దాంపత్య జీవితంలో గొడవల కారణంగా ఇప్పటి వరకు చాలామంది మహిళలు తమ భర్తలు పెట్టే వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం, వారి నుంచి విడిపోవడం, ఇల్లు వదిలి భర్త పై ఫిర్యాదు చేయడం వంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. కానీ, మొదటిసారి ఓ భర్త తన భర్య పెట్టిన వేధింపులు భరించలేక పారిపోయాడు. అంతేకాకుండా.. జైల్లో పెట్టండి కానీ, ఇంటికి మాత్రం రాను అంటూ వాపోయాడు. ఇంతకీ ఎక్కడంటే..

తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో  విపిన్ 34) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరులోని మాన్య‌త టెక్ పార్క్‌లో ఓ ప్ర‌ముఖ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక అతడికి కి భార్య శ్రీప‌ర్ణ (42), ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కాగా, వీరు బెంగ‌ళూరులోని కొడిగేహ‌ళ్లిలో  నివసిస్తున్నారు. అయితే విపిన్ భార్య అతడితో తరుచు గొడవపడుతునే ఉండేది.  దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన విపిన్ ఓ రోజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే తన భార్యకు ఆఫీసు పనిపైన వెళ్తున్న అని చెప్పాడు. ఇక అలా చెప్పి వెళ్లిన భర్త వారం  రోజులు అయినా ఇంటికి తిరిగి రాకపోవడమే కాకుండా.. ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో శ్రీపర్ణ భర్త విపిన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మరోవైపు బ్యాంకు నుంచి విపిన్ లక్షరూపాయాలకు పైగా విత్ డ్రా చేయడంతో అనుమానం వచ్చిన శ్రీపర్ణ ఈనెల 6వ తేదీన కొడిగేహళ్లి పోలీసులను మరోసారి ఆశ్రయించింది.

కానీ, మొదట పోలీసులను ఆశ్రయించిన  శ్రీపర్ణ వారు తన కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నరని భావించి ఏకంగా ఎక్స్ లో ప్రధానిని ట్యాగ్ చేసింది. దీంతో పోలీసులు శ్రీపర్ణ చేసిన ఫిర్యాదు పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు విపిన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. ఇక అక్కడి నుంచి ఆయనను బెంగళూరుకు తీసుకొచ్చారు. అయితే విపన్ ను విచారించిన పోలీసులు ఆయన చెప్పిన మాటాలు విని ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే.. విపిన్ తన భార్య పెట్టే హింసను భరించలేకపోతున్నానని వాపోయాడు. అందుకే ఇంటి నుంచి పారిపోయానని చెప్పాడు. అంతేాకాకుండా.. తన మీద ఏ కేసు పెట్టిన అవసరమైతే జైలుకైనా వెళ్తను కానీ, ఇంటికి వెళ్లనని విపిన్ పోలీసులు దగ్గర వాపోయాడు. ఇక విపిన్ చెప్పిన మాటాలు విన్న పోలీసులు ఆయనను సముదాయించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరీ, భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆ భర్త చేసిన పై మీ అభిప్రాయలను తెలియజేయండి.