iDreamPost
android-app
ios-app

రూ.28 వేల కోట్ల ఆస్తి.. ఇప్పటికీ సైకిల్‌ పైనే ప్రయాణం! కారణం ఏమిటంటే..!

  • Published May 30, 2024 | 1:29 PM Updated Updated May 30, 2024 | 1:29 PM

Sridhar Vembu Success Story: చాలా మంది కాస్తా డబ్బులు రాగానే అహంకారం పెరుగుతుంది. ఆస్తి పెరిగే కొద్ది లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోతుంటారు. కానీ, కొందరు మాత్రం ఎన్నికోట్ల ఆస్తి ఉన్న చాలా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం..

Sridhar Vembu Success Story: చాలా మంది కాస్తా డబ్బులు రాగానే అహంకారం పెరుగుతుంది. ఆస్తి పెరిగే కొద్ది లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోతుంటారు. కానీ, కొందరు మాత్రం ఎన్నికోట్ల ఆస్తి ఉన్న చాలా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం..

  • Published May 30, 2024 | 1:29 PMUpdated May 30, 2024 | 1:29 PM
రూ.28 వేల కోట్ల ఆస్తి.. ఇప్పటికీ సైకిల్‌ పైనే ప్రయాణం! కారణం ఏమిటంటే..!

చాలా మంది జీవితంలో బాగా డబ్బులు సంపాదించాలని  భావిస్తుంటారు. అలా రేయింబవళ్లు కష్టపడి, తమదైన కృషి, ఆలోనచలతో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. కొందరు బాగా సంపాదన రాగానే కొంతమందికి గర్వం వస్తుంది. అంతేకాక ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం కోట్ల ఆస్తిని సంపాదించినప్పటికీ ఎంతో సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. తమ మూలాలను మర్చిపోకుండా సాధారణంగానే జీవిస్తుంటారు. అలానే 28 వేల కోట్ల ఆస్తికి అధిపతి.. ఇప్పటికీ సైకిల్ మీదనే ప్రయణం చేస్తున్నారు. మరి.. ఆయన ఎవరు.. అసలు ఆయన స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎక్కువ మంది కాస్తా డబ్బులు రాగానే అహంకారం పెరుగుతుంది. ఆస్తి పెరిగే కొద్ది లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోతుంటారు. ఇక తమకంటే తోపు ఇంకెవరూ లేరన్నట్లు ప్రవర్తిస్తారు. శ్రీధర్ వెంబ్ అనే ఓ వ్యాపార వేత్త మాత్రం అందరికి ఆదర్శంగా నిలిచారు. వేల కోట్ల ఆస్తి ఉన్నా ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నారు. విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంతోనూ ప్రసిద్ధి చెందారు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో శ్రీధర్ వెంబు జన్మించారు.

Sridhar Vembu

ఆయన ఐఐటీ జేఈఈ పరీక్షలో 27వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్ లో తన విద్యాభ్యాసం కొనసాగించారు. ఆపై చదువులను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు.  చదువు పూర్తైన వెంటనే 1994లో క్వాల్ కామ్ లో పని చేశారు. అయితే ఆయనకు చిన్నతనం నుంచి  ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని ఆయనకు కోరిక ఉంటేది. అందుకే మంచి జీతం వచ్చే జాబ్ ను వదిలేశారు. అయితే అప్పటికే ఆయన సోదరుడు చెన్నైలో అడ్వెంట్ నెట్ అనే సాఫ్ట్  వేర్ కంపెనీని నడపుతున్నారు.

2001లో ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంట్ నెట్ భారీగా నష్టాన్ని చవిచూసింది.  ఇది సమయంలో జోహ్ డొమైన్ నేమ్మును శ్రీధర్ వెంబ్ కొనుగోలు చేశారు. 2009లో  తన కంపెనీలో అడ్వెంట్ నెట్ కంపెనీని విలీనం చేశారు.  ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.  అంతేకాక 2021 నవంబర్ నాటికి జోహో కంపెనీ ఆదాయం 1 బిలియన్ డాలర్లకు చేరింది. కొవిడ్ టైమ్ లో కూడా  ఈ కంపెనీ భారీ లాభాలు పొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. అయినా శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ 28 వేల కోట్లని అంచనా.

Sridhar Vembu

ఫోర్బ్స్ డేటా ప్రకారం, భారతదేశంలోని రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. సూటు, బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచెను ధరిస్తున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అలానే తన ప్రయాణంకి ఖరీదైన కార్లు కాకుండా.. సైకిల్ ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆయనకు అలా జీవనం సాగించడమే ఇష్టమంట. కొంత ధనం రాగానే మిడిసి పడే వారు.. శ్రీధర్ వెంబును చూసైన బుద్ధి మార్చుకోవాలని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş