iDreamPost
android-app
ios-app

Air India: ఎయిర్‌ ఇండియాలో భారీ కుదుపు.. ఆ విమాన సర్వీసులు రద్దు!

  • Published May 08, 2024 | 12:28 PM Updated Updated May 08, 2024 | 12:28 PM

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా 86 విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అసలు అన్ని సర్వీస్‌లు ఎందుకు రద్దు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా 86 విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అసలు అన్ని సర్వీస్‌లు ఎందుకు రద్దు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 08, 2024 | 12:28 PMUpdated May 08, 2024 | 12:28 PM
Air India: ఎయిర్‌ ఇండియాలో భారీ కుదుపు.. ఆ విమాన సర్వీసులు రద్దు!

ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థకు చెందిన 86 సర్వీస్‌లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగులు ఇచ్చిన షాక్‌తో సంస్థ ఏకంగా 86 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. దాదాపు 300 వందల మంది సిబ్బంది చివరి నిమిషంలో సిక్‌ లీవ్‌ పెట్టడంతో ఎయిర్‌ ఇండియాలో ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చింది. డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్లు రద్దు చేసింది సంస్థ. ఉన్నపళంగా ఇన్ని సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ నగరాలు, విదేశాలకు వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసలు రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. ఆయా విమానాల్లో గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్స్‌లోనే వేచి చూస్తూ.. నానా అవస్థలు పడ్డారు. తమ సిబ్బంది చివరి నిమిషంలో సెలవు పెట్టడంతో సర్వీస్‌లు రద్దు చేయాల్సి వచ్చిందని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల సామూహిక సెలవుల వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఎయిర్‌ ఇండియా కంపెనీ తెలిపింది. ఈ విషయంపై ఎయిర్‌ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తమ సిబ్బంది ఒకే సారి సిక్‌ లీవ్‌ పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించిన వారికి మరో తేదీకి టిక్కెట్‌ ఇష్యూ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 300 మంది క్యాబిన్‌‍ క్రూ సిబ్బంది సిక్‌ లీవ్‌ పెట్టడం వల్ల ఆ ప్రభావం బుధవారం కూడా పడే అవకాశం ఉందని, ఎయిర్ పోర్ట్‌కు వచ్చే ముందే తమ ఫ్లైట్‌ పరిస్థితిని వెబ్‌సైట్‌లో చూసుకుని ఇంటి నుంచి ప్రయాణికులు బయలుదేరాలని కోరారు. మరి అంత మంది సిబ్బంది ఒకే సారి మూకుమ్మడిగా సెలువ పెట్టారంటే కచ్చితంగా జీతం సమస్యలే అయి ఉంటాయనే టాక్‌ వినిపిస్తోంది. ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి టాటా కంపెనీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేసి.. సమర్థవంతంగా నడిపిస్తున్న టాటా కంపెనీకి.. ఈ ఉద్యోగుల సెలువు ఇబ్బంది కరంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.