Krishna Kowshik
ఆ ముదసలికి 77 ఏళ్లు. పింఛనుపై ఆధారపడి జీవిస్తుంది. తనకు వచ్చే కాసిన్నీ డబ్బులే జీవనాధారం. అయితే రెండు నెలలుగా ఆమెకు ఎందుకో పింఛను డబ్బులు రావడం లేదు. అయితే.. ఓ ప్రభుత్వ ఉద్యోగిని అడిగితే వృద్దురాలు అని చూడకుండా గసురుకున్నాడు. దీంతో
ఆ ముదసలికి 77 ఏళ్లు. పింఛనుపై ఆధారపడి జీవిస్తుంది. తనకు వచ్చే కాసిన్నీ డబ్బులే జీవనాధారం. అయితే రెండు నెలలుగా ఆమెకు ఎందుకో పింఛను డబ్బులు రావడం లేదు. అయితే.. ఓ ప్రభుత్వ ఉద్యోగిని అడిగితే వృద్దురాలు అని చూడకుండా గసురుకున్నాడు. దీంతో
Krishna Kowshik
తమకు వచ్చిన పింఛను మీద బ్రతుకుతుంటారు వయో వృద్ధులు. తమ జీవనాధారమైన పెన్షన్‌తోనే వారి ఆర్థిక అవసరాలు వీటితోనే తీర్చుకుంటారు. కానీ ఆ పింఛనే లేకపోతే.. పట్టించుకునే నాధుడే ఉండదు. ఇల్లు గడవడం కూడా కష్టం. పెద్దరికం అడ్డు వచ్చి.. ఎవ్వరినీ చేయి చాచి అడగలేరు. అలా అని ఎన్నాళ్లు కడుపు మాడ్చుకోగలుగుతారు. ఆ పెన్షన్ పొందేందుకు ఓ ముసలి అవ్వ పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఆమె డబ్బులు పొందేందుకు పడుతున్న కష్టాన్ని చూస్తే గుండెలు తరుక్కుపోతున్నాయి. శరీరం సహకరించకపోయినా.. చివరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చర్చగా మారింది.
వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన 77 ఏళ్ల గిరిజమ్మ అనే బామ్మ.. జీవనాధారం పింఛను. 2 నెలలుగా ఆమెకు పెన్షన్ రావడం లేదు. ప్రతి నెల తెచ్చిచ్చే పోస్టు మ్యాన్‌ను అడిగితే.. దురుసుగా సమాధానం చెప్పాడు. చేసేదేమీ లేక కొన్ని రోజులు అలా ఉండిపోయింది. అయితే తన వద్ద డబ్బులు అయిపోవడంతో పెన్షన్ డబ్బులు తెచ్చుకోవాలని అనుకుంది. కెనెబెలకెరెలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఆటో ఎక్కేందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. దీంతో ఆ వయస్సులో కూడా వెనకడుగు వేయకుండా.. తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. కొంచెం నడకకే కాళ్లు నొప్పులు అంటున్నారు ఈ రోజుల్లో ఆమె నడవలేని పరిస్థితులో ఉండి పోస్టాఫీసుకు వెళ్లింది.
కాళ్లు సహకరించకపోయినా.. దేక్కుంటూనే తన ఊరు నుండి 2 కిలో మీటర్ల ఆవల ఉన్న పోస్టాఫీసుకు చేరుకుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంటి దగ్గర మొదలైన ఆమె ప్రయాణం.. సాయంత్రం 4 గంటలకు పోస్టాఫీసుకు చేరుకోవడంతో ముగిసింది. 2 కిలో మీటర్లు వెళ్లేందుకు 8 గంటల పాటు కాళ్లూ ఈడ్చుకుంటూనే వెళ్లింది. పోస్టాఫీసుకు చేరుకున్న గిరిజమ్మ పరిస్థితిని చూసి అక్కడి అధికారులు చలించిపోయారు. కాళ్లు ఈడ్వడం వల్ల గాయాలు అయ్యాయి. వీటిని చూసిన అధికారులు.. ఆమెకు ఆహారం అందించి..ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఈ వయస్సులో కూడా తన పెన్షన్ డబ్బుల కోసం శ్రమిస్తున్న ఈ అవ్వ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పింఛన్ కోసం..బామ్మ కష్టాలు..
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు 2నెలలుగా రాలేదు. అడిగితే పోస్టుమాన్ విసుక్కుంటున్నాడు.
దీంతో రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసుకు చేరుకుందా పెద్దావిడ. దాని వల్ల కాళ్లంతా… pic.twitter.com/T1799IIpGF
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2024