వీడియో: ట్రైన్‌ నుంచి జారి నాలాలో పడిన 4 నెలల పసికందు..!

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలలు నదులను, చెరువులను తలపిస్తున్నాయి. ఇక  ఈ భారీ వర్షాల ధాటికి ప్రజలకు చిగురాటుకుల వణికిపోతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. అలానే ఈ వరదల  కారణంగా పదుల సంఖ్యలకు జనాలు మృతి చెందారు. అంతేకాక వరదల కారణంగా ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముంబై లోకల్ ట్రైన్‌ నుంచి ఓ 4 నెలల పసికందు ప్రమాదవశాత్తు  జారి.. నాలాలో పడిపోయింది. అనంతరం నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో గల్లంతయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ముంబై లోని లోకల్ ట్రైన్ లో ఓ కుటుంబం ప్రయాణిస్తుంది. కళ్యాణ్ -ఠాకుర్లి మధ్య నడుస్తున్న లోకల్ ట్రైన్ లో సదరు వ్యక్తి.. తన కుమార్తె, నాలుగు నెలల మనవరాలితో ప్రయాణిస్తున్నాడు. వీరు భీవండి ప్రాంతం నుంచి తమ ఇంటికి వెళ్లేంది ఈ లోకల్ ట్రైన్ ఎక్కారు. అయితే భారీ వర్షాల కారణంగా పట్టాలపై కి నీరు చేరడంతో ఓ ప్రాంతంలోని బ్రిడ్జిపై ఈ లోకల్ ట్రైన్ ను ఆపేశారు. రెండు గంటల పాటు పాట్రి బ్రిడ్జి వద్ద ఆ లోకల్ ట్రైన్ నిలిచిపోయింది.  ఈ క్రమంలో ఆయన నాలుగు నెలల మనవరాలు తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. దీంతో ఆ పాప ఏడుపును ఆపేందుకు ఆమె తల్లి, తాత ఎంతో ప్రయత్నించారు. ఇక రైలు కదిలేలా లేదు అని భావించిన తన బిడ్డను తీసుకుని రైలు దిగాలని ఆ మహిళ భావించింది. ఆ రైలు బ్రిడ్జి మీద ఉండటంతో కిందికి దిగడం చాలా కష్టంగా మారింది.

అయినప్పటికీ సదరు మహిళ కిందికి దిగేందుకు ప్రయత్నించి మధ్యలో చిక్కుకుంది. అది చూసిన ఆమె తండ్రి కుమార్తెను, మనవరాలిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ మహిళ చేతుల్లో ఉన్న పసికందు జారిపోయి..మురుగునీటి ప్రవాహంలో పడిపోయింది. క్షణాల్లో ఆ పాప మురికి నీటిలో కొట్టుకో పోయింది. నీటిలో కొట్టుకుపోతున్న పసికందును చూసి రోదించారు. తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బంది సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. ఆ నాలాలో గాలింపు చేపట్టారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ పసికందు ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు!

Show comments