Arjun Suravaram
సాధారణంగా సమాజంలో తమ స్వార్థం చూసుకునే మనుషులే ఎక్కువగా ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఇతరుల కోసం ఆలోచిస్తుంటారు. అలాంటి వారే చరిత్రలో చిరంజీవులుగా నిలిచిపోతుంటారు. తాజాగా 55 ఏళ్ల మహిళ పిల్లల కష్టం చూడలేక గొప్ప నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా సమాజంలో తమ స్వార్థం చూసుకునే మనుషులే ఎక్కువగా ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఇతరుల కోసం ఆలోచిస్తుంటారు. అలాంటి వారే చరిత్రలో చిరంజీవులుగా నిలిచిపోతుంటారు. తాజాగా 55 ఏళ్ల మహిళ పిల్లల కష్టం చూడలేక గొప్ప నిర్ణయం తీసుకుంది.
Arjun Suravaram
పురాతన కాలం నుంచి మహిళపై సమాజంలో ఓ చిన్నచూపు ఉండేది. వారిని కేవలం వంటింటి మనుషులుగానే భావించేవారు. అందుకే వారికి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఇచ్చే వారు కాదు. నేటికాలంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్నారు. ఏ విషయంలోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. మేధాశక్తి మొదలు భౌతిక పని వరకు ప్రతిదానిలోనూ తాము ఎక్కడ తక్కువ కాదని మహిళలు సాటి చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పనికి.. పురుషులు సైతం నోర్లు వెళ్లబెట్టారు. ఆమె చేసిన పని చూస్తే.. ఇంకెవరూ.. ఆడవారు మగవారి కంటే తక్కువ అనే మాటను అనడానికి ధైర్యం చేయరు.
బీహార్ కు చెందిన దశరథ్ మాంజీ అనే వృద్ధుడి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన పెద్ద కొండను తవ్వి ఒక రోడ్డును సృష్టించారు. ఆ పెద్దాయన ఆ కొండను ఏళ్ల తరబడి తవ్వి.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో ఆయనను స్థానికులు కలియుగ భగీరథుడు అంటూ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఇటువంటి భగీరథ ప్రయత్నమే ఓ మహిళ చేశారు. కర్నాటకకు చెందిన గౌరి నాయక్ అనే మహిళ.. పిల్లల కోసం నీటి బావిని తవ్వారు. కర్ణాటక రాష్ట్రం, ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన గౌరి అనే 55 ఏళ్ల మహిళ.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వారు నివసించే ప్రాంతంలో నీటి ఎద్దడి బాగా ఉండేది. దీంతో ఆమె స్థానికంగా నీటి కొరత తీర్చాలనుకుని ఇప్పటి వరకు రెండు బావులను తవ్వారు.
తాజాగా మరో బావి తవ్వే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. స్థానికంగా ఉన్న అంగన్వాడీ పిల్లల నీటి కోసం ఎంతో అల్లాడిపోవడం ఆమె గమనించారు. వారి సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలని ఆమె భావించారు. దీంతో ఇప్పటికే రెండు బావులు తవ్వి.. స్థానికంగా అపర భగీరథ అని పేరు తెచ్చుకున్న ఆమె.. మూడో బావిని తవ్వేందుకు సిద్ధమయ్యారు. గౌరి నాయక్ అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వేందుకు సిద్ధమయ్యారు. వారం రోజుల క్రితం ఈ బృహత్తర కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తున్నారు. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతూ వస్తున్నారు. నెల రోజుల్లో పిల్లలకు నీరు అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ గొప్ప కార్యక్రమం పూరై.. పిల్లలకు దాహర్తి తీరనుంది.
ఇక ఆమె బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి చెప్పుకొచ్చారు. పిల్లలు దాహం కోసం ఇబ్బంది పడటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె తెలిపారు. ఇటువంటి దుర్భర పరిస్థితే తనలో బావిని తవ్వేందుకు ప్రేరణ కల్పించిందని ఆమె పేర్కొన్నారు. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారని.. అందరూ ఆమెను భగీరథుడే గౌరీ రూపంలో వచ్చాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ భగీరథుడు పైనున్న ఆకాశ గంగను నేల మీదకు తీసుకొస్తే.. ఈ గౌరీ తల్లి భూమి లోపల ఉన్న గంగను నేల మీదకు తెచ్చి పిల్లల గొంతు తడపాలనుకుంటున్నారు. మరి.. ఈ తల్లి ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. పిల్లల కోసం 55 ఏళ్ల వయసులో అలుపెరగకుండా బావి తవ్వాలనుకున్న అపర భగీరథ గౌరమ్మ దృఢ సంకల్పంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.