iDreamPost
android-app
ios-app

నాణ్యత పరీక్షలో 49 రకాల మందులు ఫెయిల్! ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

  • Published Oct 26, 2024 | 3:33 PM Updated Updated Oct 26, 2024 | 3:33 PM

Medicines: సెప్టెంబర్, 2024 లో 3000 ఔషదాలను టెస్టింగ్ చేయగా అందులో 49 ఔషధ ఉత్పత్తులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని సెట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తేల్చి చెప్పింది. దీంతో ఆయా కంపెనీలకు సంబంధించి మెడిసన్స్ వాడుతున్న వారుభయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Medicines: సెప్టెంబర్, 2024 లో 3000 ఔషదాలను టెస్టింగ్ చేయగా అందులో 49 ఔషధ ఉత్పత్తులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని సెట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తేల్చి చెప్పింది. దీంతో ఆయా కంపెనీలకు సంబంధించి మెడిసన్స్ వాడుతున్న వారుభయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యత పరీక్షలో 49 రకాల మందులు ఫెయిల్! ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

దేశంలో గత నెల ఔషదాల నాణ్యత పరీక్షలకు సంబంధించి సెట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం 3000 ఔషదాలను టెస్టింగ్ చేయగా అందులో 49 ఔషధ ఉత్పత్తులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ మెడిసన్స్ గనక వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబోరేటరీస్ తయారు చేస్తున్న కాల్షియం 500 ఎంజీ, విటమిన్ డి3 250 ఐయూ టాబ్లెట్స్ తో పాటు ఇతర మందులు ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (NSQ)ఔషధాల రేటు గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది చాలా వరకు తగ్గిపోయిందని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇందులో భాగంగా  49 రకాల మెడిసన్స్ లో మధుమేహానికి వాడే మెట్ ఫార్మిన్ హైడ్రో క్లోరైడ్, కడుపు నొప్పి ఇన్పెక్షన్ కి వాడే మెట్రో నిడాజోల్ మాత్రలు, పెయిన్ కిల్లర్ డైక్లో ఫెనాక్ సోడియం, యాంటీబయోటిక్ జెంటామిసిన్ ఇంజెక్షన్ తో పాటు యాంటీ – అలెర్జీ ఫెక్సో ఫెనాడిన్ హైడ్రో క్లోరైడ్ వంటి మెడిసన్స్ ఉన్నాయి CDSCO గుర్తించింది. ఈ విషయంలో ప్రజలతో పాటు వైద్యులు, సంబంధిత రంగాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని CDSCO సూచిస్తుంది. కాగా, గత నెల కొన్ని ఫార్మాన్యూటికల్ కంపెనీల పేర్లను పేర్కొకుండా ప్రత్యేక జాబితా రిలీజ్ చేసింది CDSCO. అంతేకాదు ఈ మందులు ఉత్పత్తి అసలు తయారీదారులచే తయారే చేయబడవు.. అందుకే వీటిని ప్రభుత్వం నకిలీ మందులుగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో నాలుగు ఔషదాలు ఉన్నాయి. సిప్లాస్ యురిమాక్స్ డి, టొరెంట్ ఫార్మాన్యూటికరల్స్ షెల్కాల్, ఆల్కెమ్ ల్యాబ్ పాన్ డి, జైడస్ హెల్త్‌కేర్ డెకాడ్యురాబోలిన్ ఇంజెక్షన్ లో నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయినట్లు CDSCO షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది.

ఈ నాలుగు ఔషధ కంపెనీలు ఉత్పత్తులను తాము ఉత్పత్తి చేయలేదని ఔషధ నియంత్రణ సంస్థలకు తెలియజేశాయి. ఈ మెడిసన్స్ స్కామ్ వెనుక ఎవరో పెద్దల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నేరస్థులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతుందని అన్నారు. అసలు తయారీదారుల కంపెనీ నుంచి ఆ మెడిసన్స్ తయారు కాలేదని, అది నకిలీ డ్రగ్ అని తెలియజేశారు. నకిలీ కంపెనీలు తయారు చేస్తున్న నాలుగు ఔషదాలు కలుషితమైనవని గుర్తించామని CDSCO అధికారులు పేర్కొన్నారు. ప్రామాణికం లేని మందులను బ్యాచ్ ల వారీగా రీకాల్ చేశామని, ప్రజల ఆరోగ్యం భద్రతకు భరోసా కల్పించేందుకు వాటిపై నిషేదం విధించామని అంటున్నారు.