iDreamPost
android-app
ios-app

చెత్త కుప్పలో రూ.25 కోట్లు దొరికాయి.. తర్వాత ఏం చేశాడంటే!

  • Published Nov 08, 2023 | 4:18 PM Updated Updated Nov 10, 2023 | 1:07 PM

అప్పుడప్పుడు చెత్త కాగితాలు ఏరుకునే వారికి అనుకోకుండా విలువైన వస్తువులు, డబ్బు దొరుకుంతుంటాయి. అవి కాస్త వెలుగులోకి రావడంతో పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.

అప్పుడప్పుడు చెత్త కాగితాలు ఏరుకునే వారికి అనుకోకుండా విలువైన వస్తువులు, డబ్బు దొరుకుంతుంటాయి. అవి కాస్త వెలుగులోకి రావడంతో పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.

చెత్త కుప్పలో రూ.25 కోట్లు దొరికాయి.. తర్వాత ఏం చేశాడంటే!

కొన్నిసార్లు అదృష్ట లక్ష్మి తలుపు తట్టినట్టే తట్టి వెళ్లిపోతుంది. కొంతమందికి కోట్ల డబ్బు ఎదురుగా ఉన్నా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల బ్యాంక్ సిబ్బంది చేస్తున్న పొరపాటు వల్ల కొంతమంది అకౌంట్స్ లో కోట్ల కొద్ది డబ్బు జమ అవుతుంది. సదరు వ్యక్తులు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే.. కోట్ల డబ్బు తమ ఖాతాలో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. కానీ వాటిని వాడుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు బ్యాంకు కు వెళ్లడంతో అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. కొంతమందికి అనుకోకుండా డబ్బు, బంగారం, వజ్రాలు.. ఇతర విలువైన వస్తువులు దొరికినా వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది.. లేదంటే కొత్త చిక్కులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవించే ఓ వ్యక్తికి చెత్త కుప్పలో బ్యాగ్ దొరికింది. దాన్ని తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముందీ? పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్‌లోని నదియాకు చెందిన ఎస్‌కె సాల్మన్ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 3న బెంగళూరు నాగవార రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌ల పక్కన చెత్తను సేకరిస్తున్న సాల్మన్‌కు బ్యాగ్‌ దొరికింది. అమృతహళ్లిలోని తన ఇంటికి బ్యాగును తీసుకెళ్లి తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ బ్యాగ్ లో 30 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. భారత కరెన్సీ ప్రకారం దాని విలువ రూ.25 కోట్లు ఉంటుంది. దానిపై యునైటెడ్ నేషన్స్ అనే ముద్ర ఉంది. బ్యాగ్ లో దొరికిన విదేశీ కరెన్సీ చూసి సాల్మాన్ కి ఒక్కసారే కళ్లు తిరిగాయి.. ఏం చేయాలో అర్థం కాలేదు. అంత డబ్బు కళ్ల ముందు ఉంది.. కానీ అది విదేశీ కరెన్సీ. తర్వాత రోజు తనకు ఒక బ్యాగ్ దొరికిందని.. ఆ బ్యాగ్ లో విదేశీ కరెన్సీ కట్టలు ఉన్నాయని గుజరీ వ్యాపారికి తెలియజేశాడు. ఆ వ్యాపారి ప్రస్తుతం వేరే ఊరు వెళ్లానని, బెంగుళూరు వచ్చే వరకు మీ దగ్గర ఉంచుకోవాలని సూచించాడు.

డబ్బు బ్యాగ్ చూసి భయపడ్డ సాల్మన్.. రెండు రోజుల తర్వాత స్వరాజ్ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్ కలీముల్లాకు పూర్తి విషయం చెప్పాడు. వెంటనే ఆ విషయాన్ని కలీముల్లా నగర పోలీసు కమిషనర్ దయానందకు తెలియజేశారు. అతని సూచన మేరకు సాల్మన్, నగదు తీసుకుని కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ బ్యాగ్ దొరికిన చోట క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ డాలర్లు నకిలీవని భావిస్తున్నారు. వాటిని వెరిఫికేషన్ కోసం నగరంలోని రిజర్వ్ బ్యాంక్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. బ్యాగ్ లో దొరికిన డబ్బు ఐక్యరాజ్యసమితి ఆర్థిక నేరాల విభాగానికి చెందినదని పోలీసులు తెలిపారు. బ్యాగ్‌లో విషపూరిత రసాయనాలు ఉన్నందున, దాన్ని తెరిచేటపుడు జాగ్రత్తగా ఉండండి అనే పెద్ద అక్షరం కూడా ఉంది. అంత డబ్బును చూసి ఓ రోజంతా నిద్రపోలేదని చాలా రెచ్చిపోయానని సాల్మన్ చెప్పాడు.