Arjun Suravaram
మన ఆరోగ్యం బాగుండాలంటే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కలుషితమైన ఆహారం తీసుకుంటే జరిగే పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ జరిగి.. ఏకంగా 2000 వేల మంది అస్వస్థతకు గురయ్యారు.
మన ఆరోగ్యం బాగుండాలంటే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కలుషితమైన ఆహారం తీసుకుంటే జరిగే పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ జరిగి.. ఏకంగా 2000 వేల మంది అస్వస్థతకు గురయ్యారు.
Arjun Suravaram
మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపే వాటిల్లో ప్రధానమైనది ఆహారం. ఎలాంటి ఫుడ్ తీసుకున్నామనే దానిపైనే మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా మంది తినే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు ఆహారం కలుషితమవుతుంది. అలాంటి భోజనాన్ని స్వీకరించిన వారు అస్వస్థతకు గురవుతుంటారు. అంతేకాక ఈ పుడ్ పాయిజన్ కారణంగా మరణాలు సంభవించిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో పుడ్ పాయిజన్ కారణంగా 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.
మంగళవారం మహారాష్ట్ర, నాందేడ్ జిల్లాలోని కోష్టవాడి గ్రామంలో ఒక మతపరమైన వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామానికి చెందిన వారే కాకుండా పక్కనే ఉన్న సవర్గాన్, రిసన్గాన్, మాస్కి, పోష్ట్ వాడి అనే మరో నాలుగు గ్రామాల నుంచి కూడా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఇక ఆ వేడుక ఎంతో కోలాహలంగా సాగింది. అలానే అక్కడికి విచ్చేసిన వారికి నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ భోజనాలు చేశారు. ఇక సాయంత్రం 5 గంటలకు భోజనాలు తిన్న వారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు.
బుధవారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలు కావడంతో తీవ్ర నీరసంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. అయితే అస్వస్థకు గురైన వారిలో కాస్తా సీరియస్ గా ఉన్న 150 మందిని నాందేడ్ జిల్లా కేంద్రంలోని లోహా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఇదే రకమైన సమస్యతో వందలాది మంది ఆస్పత్రుల్లో చేరారని స్థానికులు వెల్లడించారు. మరో 870 మంది కూడా అక్కడ ఇవే సమస్యలతో బాధపడుతునట్లు సమాచారం. మొత్తంగా ఆ చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానిక వైద్య బృందం అప్రమత్తమైంది. ఇలా అస్వస్థతో వచ్చే రోగుల కోసం అదనంగా పడకలను, మందులు, ఇతర వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు.
ఇలా దాదాపు 2 వేల మంది వాతులు, విరేచనాలు చేసుకుంటూ అస్వస్థకు గురైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, అలానే బాధితుల్లో ఎవరి పరిస్థితి అత్యంత విషమంగా లేదని స్థానిక అధికారులు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. అస్వస్థకు గురైన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించారు. అలానే ఈ కలుషిత ఆహారం ప్రభావానికి గురైన గ్రామాల్లో సర్వే కోసం ఐదు మెడికల్ టీమ్స్ ను ప్రభుత్వం నియమించింది.