iDreamPost
android-app
ios-app

ఇదేందయ్యా ఇది.. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • Published Sep 23, 2024 | 12:44 PM Updated Updated Sep 23, 2024 | 12:44 PM

Fake IPS Officer: ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బు కాజేసే వారి గురించి చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా బీహార్ లో మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

Fake IPS Officer: ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బు కాజేసే వారి గురించి చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా బీహార్ లో మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

  • Published Sep 23, 2024 | 12:44 PMUpdated Sep 23, 2024 | 12:44 PM
ఇదేందయ్యా ఇది.. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

చిన్నదో పెద్దదో ఏదైనా ఒక ఉద్యోగం చేసి.. తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఎంతో మంది కలలు కంటారు. ఇలాంటి వారి అమాయకత్వాన్ని, ఉద్యోగం పట్ల వారికి ఉన్న ఆశలను ఆసరాగా తీసుకుంటున్నారు మోసగాళ్లు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి కోట్లలో డబ్బు కాజేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వార్తలను ఎన్నో చూసి ఉంటాము. ప్రజలలో దీని పట్ల అవగాహన కల్పిస్తున్న సరే, ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లోని జాముయ్ లో ఇలాంటి ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పోలీస్ ఉద్యోగాన్నే ఎరగా వేశారు మోసగాళ్లు. అసలు ఏమైందో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

బీహార్ లోని జాముయ్ లో ఓ యువకుడి దగ్గర రూ.రెండు లక్షల రూపాయలు తీసుకుని బురిడీ కొట్టించారు. జాముయ్ సబ్ ఇన్స్పెక్టర్ నకిలీ ట్రైనీ ఐపిఎస్ ని అరెస్ట్ చేయగా.. అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో బయటపడిన కథనాలు ఇలా ఉన్నాయి. జముయు జిల్లా సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో.. బైక్ పై తిరుగుతూ కనిపించాడు మిథిలేష్ మాంఝీ. దీనితో అతనిపై పోలీసులకు అనుమానం కలిగి.. మొదట సున్నితంగానే హెచ్చరించారు. చిన్నపిల్లలు పోలీస్ యూనిఫార్మ్ కొనుక్కుంటే సరదాగా ఉంటుందని.. ఈ వయసులో ఇలా డ్రెస్ వేసుకుని తిరిగితే మోసం కింద కేసు పెడతాం అని చెప్పారు. కానీ ఆ యువకుడు మాత్రం తానే ఐపిఎస్ ఆఫీసర్ నంటూ ఎదురు దాడికి దిగాడు. పైగా అతని దగ్గర గన్ కూడా ఉండడంతో పోలీసులు వెంటనే అతనిని అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత వారి విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆ యువకుడు ఓ జలపాతం వద్దకు టూర్ కు వెళ్ళినపుడు అతనికి ఓ యువకుడు పరిచయం అయ్యాడట. మాయమాటలు చెప్పి.. తక్కువ రేట్ కే ఐపీఎస్ ఆఫీసర్ ను చేస్తానని చెప్పడంతో.. ఈ యువకుడు ఎగిరి గంతేశాడు. తన ముందు వారితో వీరితో ఫోన్స్ మాట్లాడినట్లు నటించి రెండు రోజుల్లో రెండు లక్షలు ఇవ్వాలని చెప్పాడట. దీనితో వెంటనే మిథిలేష్ తన తల్లిదండ్రులను , బంధువులను వేధించి.. రెండు లక్షలు అప్పుగా తీసుకుని ఆ మోసగాడికి ఇచ్చాడట. వెంటనే అతనికి నకిలీ యూనిఫార్మ్ తో పాటు.. నకిలీ పిస్టల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఆ యువకుడు ఖైరా పోలీస్ స్టేషన్ నుంచి హాల్సి పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంటికి వెళ్తున్న సమయంలో.. గ్రామస్థులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని పూర్తి వివరాలు బయటపెట్టారు. ప్రస్తుతం అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఇంత పెద్ద మోసం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.