iDreamPost

చికెన్ ఫుడ్ ఫెస్టివల్.. 199 రూపాయలకే 100 రకాల నాన్ వెజ్ ఐటమ్స్..

100 Chicken Items Cost 199: మీకు చికెన్ అంటే ఇష్టమా? మీకు చికెన్ లో ఉన్న అన్ని రకాల ఐటమ్స్ ని రుచి చూడాలని ఉందా? కేవలం 199 రూపాయలకే మీరు చికెన్ లో ఉన్న వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేయచ్చు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో 100 రకాల చికెన్ ఐటమ్స్ కేవలం 199 రూపాయలకే అందిస్తున్నారు.

100 Chicken Items Cost 199: మీకు చికెన్ అంటే ఇష్టమా? మీకు చికెన్ లో ఉన్న అన్ని రకాల ఐటమ్స్ ని రుచి చూడాలని ఉందా? కేవలం 199 రూపాయలకే మీరు చికెన్ లో ఉన్న వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేయచ్చు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో 100 రకాల చికెన్ ఐటమ్స్ కేవలం 199 రూపాయలకే అందిస్తున్నారు.

చికెన్ ఫుడ్ ఫెస్టివల్.. 199 రూపాయలకే 100 రకాల నాన్ వెజ్ ఐటమ్స్..

చికెన్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. చికెన్ 65 అని, చిల్లీ చికెన్ అని, చికెన్ మంచూరియా, చికెన్ కబాబ్ ఇలా రకరకాల చికెన్ ఐటమ్స్ ని టేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అన్ని రకాల చికెన్ ఐటమ్స్ ని ఒకేసారి టేస్ట్ చేయాలంటే బిల్లు తడిసిమోపుడవుతుంది. పైగా అన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఒకే హోటల్ లో దొరకవు. సపోజ్.. పర్ సపోజ్ ఒకే హోటల్ లో అన్ని రకాల చికెన్ ఐటమ్స్ దొరికితే.. అది కూడా 199 రూపాయలకే ఎంత తింటే అంత చికెన్ ఐటమ్స్ వడ్డిస్తే ఎలా ఉంటుంది. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది కదా. అంటే అన్నాడు గానీ ఈ ఊహ ఎంత బాగుందో అని అనుకుంటున్నారా? మీరు ఊ అనాలే గానీ ఊహ కూడా నిజమైపోద్ది. ఎందుకంటే అక్కడ వంద రకాల చికెన్ ఐటమ్స్ ని కేవలం 199 రూపాయలకే అందిస్తున్నారు.

నాన్ వెజ్ ప్రియుల కోసం, చికెన్ అంటే పడిచచ్చిపోయే వారి కోసం అగర్తల క్లబ్ వారు ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు. గత ఏడాది చికెన్ ఫుడ్ ఫెస్టివల్ ని తొలిసారిగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా చికెన్ ఫుడ్ ఫెస్టివల్ ని జరుపుతున్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో 10 రోజుల పాటు చికెన్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ని ఒలింపియాడ్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, కోచ్ బిష్వేశ్వర్ నదితో కలిసి నిర్వహిస్తున్నారు. వంద రకాల చికెన్ వంటకాలను ఈ ఈ ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా వడ్డిస్తారు. ఒక్కో ప్లేట్ ధర కేవలం రూ. 199గా నిర్ణయించారు. యాపిల్, పైనాపిల్, మామిడి సహా అనేక రకాల సాంప్రదాయేతర పదార్థాలతో ఈ ఐటమ్స్ ని తయారు చేస్తారు.

ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ స్పైసీ ఉండేలా హెల్దీ చికెన్ వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడమే ఈ చికెన్ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం. హెల్దీ ఫుడ్ ని, టెస్టీగ, విభిన్నంగా ఎలా అందించాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ చికెన్ ఫుడ్ ఫెస్టివల్ అని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక అథ్లెట్ దీపా కర్మాకర్ మాట్లాడుతూ. తన కెరీర్ లో భాగంగా క్రమశిక్షణతో కూడిన ఫుడ్ హ్యాబిట్స్ పాటిస్తున్నా అని.. భోజన ప్రియులందరూ తప్పకుండా ఈ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొనాలని కోరారు. ఆరోగ్యకరమైన చికెన్ వంటకాలను ఆస్వాదించాలని కోరుతున్నారు. ఈ చికెన్ ఫుడ్ ఫెస్టివల్.. ఆరోగ్యం, రుచి రెండిటి సమ్మేళనాన్ని అందిస్తుందని.. చికెన్ ప్రియులందరూ తప్పకుండా ఫుడ్ ఫెస్టివల్ కి హాజరు కావాలని దీపా కర్మాకర్ ఆకాంక్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి