Swetha
Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్.. ఒక్కో రికార్డ్ ను నరుక్కుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో నిమిషం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ పైన ఓ డాక్యుమెంటరీ తీయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్.. ఒక్కో రికార్డ్ ను నరుక్కుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో నిమిషం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ పైన ఓ డాక్యుమెంటరీ తీయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
Swetha
టాలీవుడ్ లో రెబెల్ స్టార్ ప్రభాస్ కు తిరుగులేదు. ఈ మధ్య అటు బాలీవుడ్ ను కూడా ఈ పేరు భయపెట్టేస్తుంది. అక్కడ హీరోలకు తన రికార్డ్స్ తో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. రెబెల్ స్టార్ దెబ్బకు బాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. ఒక్కో సినిమాతో ఒక్కో టార్గెట్ ను ఫిక్స్ చేస్తున్నాడు. తాజాగా కల్కితో తన మార్క్ ను సెట్ చేసి పెట్టాడు. కథ నచ్చితే చాలు సినిమా చేసేస్తున్నాడు. బాహుబలి తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. ఇక ఆ తర్వాత మొదలైన ప్రభాస్ సినిమాల ఊపు.. ఇప్పటివరకు తగ్గలేదు . జెట్ స్పీడ్ లో వరుస సినిమాలతో, అప్డేట్స్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ పై డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నారట.
నిజానికి ఇండియన్ సినిమా రేంజ్ పెరిగింది ప్రభాస్ తోనే. సౌత్ లో ఎంతో మంది హీరోలు సక్సెస్ చూస్తున్నారు. కానీ ఈ రేంజ్ లో ఇప్పటివరకు ఏ హీరో బాలీవుడ్ ను షేక్ చేయలేదు. చిన్న హీరోగా మొదలయ్యి.. ఈ స్థాయికి చేరుకోవడం అంటే చిన్న విషయం కాదు. అసలు ప్రభాస్ ఈ రేంజ్ కు చేరుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు. ఒక సక్సెస్ ను చూడడం అంత ఈజీ అయితే కాదు. అందులోను మూవీ ఇండస్ట్రీలో అది చాలా కష్టమైన పని. దాని వెనుక ఎన్నో అవమానాలు , ఎన్నో రిజెక్షన్స్ ఉంటూ ఉంటాయి. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొని.. ఈ స్థాయి వరకు చేరారనే విషయాలు అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. పైగా ఇది చాలా మందికి ఆదర్శవంతంగా కూడా ఉంటుంది. ఈ క్రమంలో జీ 5 రెబెల్ స్టార్ ప్రభాస్ మీద డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తుందట. దానికి సంబంధించిన వర్క్ ను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం.
అందుకోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరు కు వెళ్ళి అక్కడ గ్రామస్థులతో.. ప్రభాస్ మొదట సినిమాలో చేసిన నటులు , డైరెక్టర్స్ , ఫ్రెండ్స్.. ఇలా ఇండస్ట్రీలో ప్రభాస్ తో ఎవరు క్లోజ్ గా ఉంటే వారితో వీడియోస్ తీసేందుకు రెడీ అవుతున్నారట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు వచ్చే ఏడాది ఆఖరిలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆల్రెడీ దర్శక ధీరుడు రాజమౌళి పై ఇలాంటి ఓ డాక్యుమెంటరీని తీశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తమ అభిమాన తారల జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి.. చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ప్రభాస్ డాక్యుమెంటరీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ , కల్కి-2 , సలార్-2 లాంటి వరుస సినిమాలతో బిజీ బిజిగా ఉన్నాడు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి ప్రభాస్ పై డాక్యుమెంటరీ తీయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.