iDreamPost
android-app
ios-app

NTR హీరోయిన్ ని పరిచయం చేసిన YVS చౌదరి!

  • Published Nov 30, 2024 | 2:01 PM Updated Updated Nov 30, 2024 | 2:51 PM

Veena Rao: ఎన్టీఆర్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ వైవీఎస్ చౌద‌రి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ అచ్చ తెలుగు అమ్మాయిని ప‌రిచ‌యం చేస్తాన‌ని వైవీఎస్ చౌద‌రి ఇది వ‌ర‌కే చెప్పారు.

Veena Rao: ఎన్టీఆర్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ వైవీఎస్ చౌద‌రి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ అచ్చ తెలుగు అమ్మాయిని ప‌రిచ‌యం చేస్తాన‌ని వైవీఎస్ చౌద‌రి ఇది వ‌ర‌కే చెప్పారు.

NTR హీరోయిన్ ని పరిచయం చేసిన YVS చౌదరి!

నందమూరి వారి కొత్త వారసుడు ఎన్టీఆర్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ వైవీఎస్ చౌద‌రి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ అచ్చ తెలుగు అమ్మాయిని ప‌రిచ‌యం చేస్తాన‌ని వైవీఎస్ చౌద‌రి ఇది వ‌ర‌కే చెప్పారు. ఆమె పేరు వీణా రావు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు వీణారావుని ఎంచుకొన్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా ఆ అమ్మాయిని పరిచయం చేశారు.సుప్రియ, స్వప్న దత్ లు వీణా రావుని పరిచయం చేశారు.అచ్చ‌మైన తెలుగమ్మాయిగా అందమే అసూయ పడేలా ఆమె మెరిసిపోతుంది.కచ్చితంగా తెలుగులో అగ్ర హీరోయిన్ గా తన ముద్ర వేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆమె వైరల్ అవుతుంది.

వీణా రావు కచ్చితంగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్ని కొల్ల‌గొట్ట‌బోతోంద‌ని వైవీఎస్ న‌మ్మ‌కంగా ఉన్నారు. పైగా ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్. అందంతో పాటు అభినయం కూడా ఆమె సొంతం. ఆమెకు క్లాసిక‌ల్ డాన్స్ కూడా వచ్చు. కూచిపూడి బాగా నేర్చుకుంది. చక్కటి తెలుగు క‌థ‌తో తీస్తున్న సినిమా ఇద‌ని, మంచి సంగీతం, సాహిత్యం ఉంటాయ‌ని, రోమాంఛిత స‌న్నివేశాలూ క‌నిపిస్తాయ‌ని చెప్పుకొచ్చారు వైవీఎస్‌. ఇప్పుడు వీణా రావుని పరిచయం చేశాక ఈ మూవీ పై అంచనాలు బాగా పెరిగాయి. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యుగంధర్ సినిమా 1979 నవంబర్ 30 న రిలీజ్ అయింది. అందుకే ఇదే రోజున వీణాని పరిచయం చేయాలి అనుకున్నట్లు YVS చౌదరి చెప్పారు. ఇక ఈ సినిమాని న్యూ టాలెంట్ రోర్స్ పతాకం పై YVS చౌదరి భార్య గీత నిర్మిస్తున్నారు.