iDreamPost

విడాకుల కోసం హీరో అప్లై.. భార్య హింసిస్తోంది కాపాడాలంటూ!

ఈ రోజుల్లో పెళ్లిళ్లు మూడు రోజుల ముచ్చటగానే ముగుస్తున్నాయి. సామాన్యుల విషయంలోనే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇదే పంథా కొనసాగుతుంది. తాజాగా మరో పెద్ద ఫ్యామిలీలో ఈ డివోర్స్ గోల మొదలైంది.

ఈ రోజుల్లో పెళ్లిళ్లు మూడు రోజుల ముచ్చటగానే ముగుస్తున్నాయి. సామాన్యుల విషయంలోనే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇదే పంథా కొనసాగుతుంది. తాజాగా మరో పెద్ద ఫ్యామిలీలో ఈ డివోర్స్ గోల మొదలైంది.

విడాకుల కోసం హీరో అప్లై..  భార్య హింసిస్తోంది కాపాడాలంటూ!

ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అందులోనూ యంగ్ అండ్ ఫేమస్ కపుల్స్ డివోర్స్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమంత-నాగ చైతన్య విడాకులను మర్చిపోక ముందు మెగా ఇంట్లో డివోర్స్ వార్తలు హల్చల్ చేశాయి. నిహారిక-చైతన్య నుండి విడిపోయింది. శ్రీజ కూడా భర్త కళ్యాణ్‌కు దూరంగా ఉంటోన్న సంగతి విదితమే. అలాగే మరో జంట ఐశ్వర్య-ధనుష్ కూడా విడిపోయి.. ఇండివిడ్యువల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ నటుడు జీవీ ప్రకాష్.. ఆయన భార్య సింగర్ సైంధవి తాము విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఇటీవల కన్నడ ఇండస్ట్రీలో కూడా బిగ్ బాస్ జంట చందన్ శెట్టి, నివేదిత గౌడ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు.

ఇప్పుడు మరో స్టార్ జంట విడిపోతుంది. అదీ కూడా ప్రముఖ స్టార్ హీరో ఇంటికి చెందిన వారసుడు విడిపోతున్నాడట. కన్నడ దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ మనవడు, నటుడు యువరాజ్ కుమార్ భార్యకు డివోర్స్ ఇవ్వబోతున్నాడు. ఆయన భార్య శ్రీదేవి నుండి ఆరు నెలలుగా దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. రాజ్ కుమార్‌కు ముగ్గురు కొడుకులు ఉన్న సంగతి విదితమే. వారిలో ఒకరు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. రాఘవేంద్ర కుమారుడే ఈ యువ రాజ్ కుమార్. అతడు కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్, ప్లే బ్యాక్ సింగ్ కూడా. యువ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్టుగానూ అలరించాడు. ఓమ్ మూవీలో బాల నటుడిగా చేశాడు.

Hero Asking Divorce

ఈ ఏడాది హీరోగా కెరీర్ స్టార్ చేశాడు యువ. మైసూరుకు చెందిన శ్రీదేవి అనే మహిళను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. 7 సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట.. 2019లో ఒక్కటైంది. రాఘవేంద్ర దంపతులు వద్దన్నా.. పునీత్ ఒప్పించి వీరి పెళ్లి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీదేవీ ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది. గతంలో  తనను హింసిస్తోందంటూ భార్యపై కేసు కూడా పెట్టాడు యువ. దీంతో వీరి మధ్య గొడవలు మరింత ముదిరి విడాకులు వరకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఈ నెల 6వ తేదీన విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కాడు యువ రాజ్ కుమార్. తన భార్య తనను అగౌరపరిచిందని, మానసికంగా వేధించిందని, తన నుండి  కాపాడాలి అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం సమన్లు జారీ చేయడంతో ఈ కేసు విచారణ జులై 4వ తేదీకి వాయిదా పడింది. దీనిపై శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. తమకు విడాకుల విషయం గురించి తెలియదని అన్నారు. కాగా, శివరాజ్ కుమార్ ఫ్యామిలీలో తొలి విడాకుల కేసు ఇదేనని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి