iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ OTTలోకి కాకినాడ పిల్ల? బామ్మర్ది కోసం గట్టిగానే ప్లానింగ్!

  • Published Jan 07, 2024 | 6:40 PM Updated Updated Jan 07, 2024 | 6:40 PM

Kakinada Pilla Into Bigg Boss OTT 2: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 గురించి ఇప్పటి నుంచే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది.

Kakinada Pilla Into Bigg Boss OTT 2: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 గురించి ఇప్పటి నుంచే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది.

  • Published Jan 07, 2024 | 6:40 PMUpdated Jan 07, 2024 | 6:40 PM
బిగ్ బాస్ OTTలోకి కాకినాడ పిల్ల? బామ్మర్ది కోసం గట్టిగానే ప్లానింగ్!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ సీజన్ 2 కోసం గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నారు. సీజన్ 7 ముగిసిన చాలా తక్కువ సమయంలోనే ఓటీటీ సీజన్ 2 కోసం భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం పాపులర్ కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కొందరిని ఓటీటీ కోసం తీసుకొస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే కాకినాడ పిల్లను కూడా ఓటీటీ సీజన్ 2 కోసం సెలక్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

కాకినాడ పిల్ల.. ఈ యూట్యూబర్ గురించి నెటిజన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బామ్మర్ది బామ్మర్ది అంటూ ఫుల్ జోష్ గా వీడియోలు చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ని తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేస్తూ అలరిస్తూ ఉంటంది. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్స్ ని కూడా కాకినాడ పిల్ల ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు ఆమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కాకినాడ పిల్ల కోసం గట్టిగానే రికమెండేషన్స్ కూడా వస్తున్నాయని చెబుతున్నారు. ఆమెకి సోషల్ మీడియాలో కూడా గట్టిగానే ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో రీల్స్, ఫొటోలు అంటూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమే బిగ్ బాస్ ఓటీటీ 2లోకి వస్తుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖషీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Just cal u Sri Ravi ❤️💕 (@kakinadapillaofficial)

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేంటంటే ఫిబ్రవరి రెండో వారం లేదా.. మంత్ లాస్ట్ నుంచి ఓటీటీ సీజన్ 2 ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కొందరి పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిలో పాట బిడ్డ భోలే షావలి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7లో భోలే షావలి అలరించిన విషయం తెలిసిందే. అయితే బాగా కనెక్ట్ అవుతున్న సమయంలో ఎలిమినేట్ అయ్యాడు. అందుకే మరోసారి భోలేకి అవకాశం ఇవ్వబోతున్నారు అని చెబుతున్నారు. అలాగే నయనీ పావనీకి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో కనిపించబోతోందని చెబుతున్నారు. అలాగే సింగర్ పార్వతీ కూడా ఓటీటీ సీజన్ 2లో ఉండబోతోందని టాక్ వస్తోంది. నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, హీరోయిన్ రీచా పనాయ్, సోనియా దీప్తీలు కూడా ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొంటారంటూ చెబుతున్నారు. మరి.. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో కాకినాడ పిల్ల పాల్గొనబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Just cal u Sri Ravi ❤️💕 (@kakinadapillaofficial)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio