iDreamPost
android-app
ios-app

హర్ష సాయి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది! ఇంత ట్విస్టు ఇచ్చాడేంటి!

  • Author ajaykrishna Published - 02:34 PM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 02:34 PM, Sun - 17 September 23
హర్ష సాయి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది! ఇంత ట్విస్టు ఇచ్చాడేంటి!

యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష సాయి గురించి జనాలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అతని హెల్పింగ్ నేచర్, పేదలకు అతను ఆర్థికంగా హెల్ప్ చేసిన తీరు.. అతన్ని స్టార్ చేశాయి. హర్ష సాయి హెల్పింగ్ వీడియోలతో క్రేజ్ సంపాదించుకున్నా.. అతని ఫైనల్ టార్గెట్ మాత్రం సినిమానే. అదికూడా ఒకేసారి హీరోగా, దర్శకుడుగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిలియన్స్ కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హర్ష సాయి.. సినిమా చేస్తున్నాడని తెలిసి సపోర్ట్ చేసేందుకు ఫ్యాన్స్ అందరు రెడీ అయిపోయారు. వాళ్ళందరిని సర్ప్రైజ్ చేస్తూ.. తాజాగా తన మూవీ టైటిల్ తో పాటు టీజర్ రిలీజ్ చేశాడు.

హర్ష సాయి.. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా పేరు ‘మెగా’. దాదాపు మూడు నిముషాల నిడివి కలిగిన టీజర్ ప్రస్తుతం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథ పరంగా సినిమా.. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని అనిపిస్తుంది. టోటల్ గా వాయిస్ ఓవర్ తో.. నేరేషన్ ఇస్తూ.. చనిపోక ముందే చావును ఎలా చూస్తారు? అనే డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు కమర్షియల్ హీరో రేంజ్ లో హర్ష సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది. కానీ.. జంతు ప్రపంచంలో అత్యంత క్రూరమైన.. అత్యంత పెద్దదైన జంతు బలంతో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేశారు. భారీ విజువల్స్ తో మిత్రా నిర్మిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి వేరే వివరాలు ఏమి రివీల్ చేయలేదు. మరి హర్ష సాయి మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş