iDreamPost
android-app
ios-app

Youtuber Chandu Sai: బ్రేకింగ్: ప్రముఖ యూట్యూబర్.. పక్కింటి కుర్రాడు చందు అరెస్ట్!

Youtuber Chandu Sai Arrested: చందు సాయి యూట్యూబ్‌లో కామెడీ వీడియోల ద్వారా చాలా పాపులర్‌ అయ్యాడు. చందూ గాడు, పక్కింటి కుర్రాడు వంటి యూట్యూబ్‌ ఛానల్స్‌లో వీడియోలు చేస్తుంటాడు.

Youtuber Chandu Sai Arrested: చందు సాయి యూట్యూబ్‌లో కామెడీ వీడియోల ద్వారా చాలా పాపులర్‌ అయ్యాడు. చందూ గాడు, పక్కింటి కుర్రాడు వంటి యూట్యూబ్‌ ఛానల్స్‌లో వీడియోలు చేస్తుంటాడు.

Youtuber Chandu Sai: బ్రేకింగ్: ప్రముఖ యూట్యూబర్.. పక్కింటి కుర్రాడు చందు అరెస్ట్!

ప్రముఖ యూట్యూబర్‌ చందు సాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాల మేరకు.. నార్సింగ్‌కి చెందిన ఓ యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆమెపై అత్యాచారం కూడా జరిపాడు. తర్వాత ముఖం చాటేశాడు. తాను మోస పోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. అతడిపై అత్యాచారం, చీటింగ్‌ కేసు పెట్టింది.

కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, చందు సాయి యూట్యూబ్లో‌ చాలా పాపులర్‌. పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియోలు చేసేవాడు. మెసేజ్‌ ఓరియెంటెడ్‌, కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు పని చేసే యూట్యూబ్‌ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చేవి. ఈ నేపథ్యంలోనే కొన్ని పుకార్లు కూడా షికార్లు చేయటం మొదలైంది.

చందు సాయి నెలకు రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.  ఆ వార్తలపై గతంలోనే అతడు క్లారిటీ ఇచ్చాడు. అంత డబ్బులు రావని తేల్చిచెప్పాడు. అయితే, ఉన్నట్టుండి చందు సాయి యూట్యూబ్‌కు దూరం అయ్యాడు. తర్వాత కొత్తగా ‘చందు గాడు’ అనే ఓ ఛానల్‌ స్టార్ట్‌ చేసి మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తూ ఉన్నాడు. ‘‘మావా బ్రో’’ ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

గతంలో చందు సాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పవర్ అంటే ఇష్టం అని.. క్లాప్ కొడితే ఇష్టం అని అన్నాడు. డబ్బులు మ్యాటర్ కాదని తనకు పేరే కావాలని తేల్చి చెప్పాడు. తాను ఇక్కడకు వచ్చింది పేరు కోసమేనని, భలే చేశావ్ రా అంటే.. భోజనం కూడా చేయాల్సిన పని ఉండదని అన్నాడు.

తాను క్లాప్ జోన్‌లో ఉండాలనే అనుకుంటున్నానని చెప్పాడు. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని, అమ్మానాన్నలతో ఓపెన్ చేయించాలనే కోరిక ఉందని తెలిపాడు. తన డ్రీమ్ అక్కడే ఆగిపోయిందన్నాడు. రెండేళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డానని.. తన కోరిక ఇంకా తీరలేదని చెప్పాడు. ఇక, చందు సాయి తన వీడియోల్లో ఎక్కువగా మెసేజ్‌లు ఇస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇలా యువతిని మోసం చేసిన కేసులో అరెస్టవ్వటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరి, చందు సాయి అరెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.