iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు రూ.150 సంపాద.. ఇప్పుడు కోటీశ్వరుడు! ఎవరు ఈ భువన్ బామ్ ?

  • Published Apr 06, 2024 | 7:46 PM Updated Updated Apr 06, 2024 | 7:46 PM

Youtuber Bhuvan Bam: దేశంలో చాలా మంది గొప్ప పొజీషన్ కి వెళ్లాలి.. కోట్లు సంపాదించాలని కోరికతో ఉంటారు. అతి కొద్ది మందే ఉన్నత శిఖరాలకు చేరుకొని సంపన్నులు అవుతుంటారు. అలాంటి వారిలో భువన్ బామ్ ఒకరు.

Youtuber Bhuvan Bam: దేశంలో చాలా మంది గొప్ప పొజీషన్ కి వెళ్లాలి.. కోట్లు సంపాదించాలని కోరికతో ఉంటారు. అతి కొద్ది మందే ఉన్నత శిఖరాలకు చేరుకొని సంపన్నులు అవుతుంటారు. అలాంటి వారిలో భువన్ బామ్ ఒకరు.

ఒకప్పుడు రూ.150 సంపాద.. ఇప్పుడు కోటీశ్వరుడు! ఎవరు ఈ  భువన్ బామ్ ?

జీవితంలో కృషీ.. పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారు అని ఎంతోమంది నిరూపించారు. కఠిక పేదరికం నుంచి సంపన్నులుగా మారిన వారు ఉన్నారు. కష్టానికి అదృష్టం కూడా తోడు ఉంటే.. ఏ మనిషైనా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పేదరికం నుంచి కోటీశ్వరులుగా మారడం అంత సులభమైన పని కాదు. దాని కోసం ఎంతో కష్టపడాలి.. ఎన్నో ఒడిదుడుకులకు ఎదురు నిలవాలి.  భువన్ బామ్ చిన్నప్పటి నుంచి మంచి గాయకుడిగా మారి అందరితో శెభాష్ అనిపించుకోవాలని భావించాడు.. కానీ గాయకుడు కాలేకపోయాడు. పదిమందిలో తాను స్పెషల్ అనిపించుకోవడానికి యూట్యూబర్ గా మారాడు.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇంతకీ ఎవరీ భువన్ బామ్.. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

భారత దేశంలో భువన్ బామ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. దేశంలోని యూట్యూబర్స్ లో కోటీశ్వరుడు. ఆయన యూట్యూబ్ ఛానెల్ ఇ ‘బిబి కి వైన్స్’ ఇప్పుడు 26.4 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గుజరాత్ లోని వడోదరలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన భువన్ బామ్ కఠిక పేదరికం నుంచి కోటీశ్వరుడుగా ఎదిగాడు. ఆయన జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. భువన్ బామ్ కి గాయకుడు కావాలని కోరిక.. కానీ దాంతో సంపాదన పెద్దగా రాదని అర్ధం చేసుకొని  యూట్యూబర్ గా మారి ఇప్పుడు టాప్ పొజీషన్ లో ఉన్నాడు. తన ఫ్రెండ్స్ తో చిన్న చిన్నకామెడీ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేవాడు. అవి బాగా పాపులర్ కావడంతో అదే ప్రొఫేషన్ గా మార్చుకున్నాడు. అనతి కాలంలోనే భువన్ బామ్ స్టార్ గా మారిపోయాడు.

కెరీర్ బిగినింగ్ లో భువన్ బామ్ చాలా కష్టాలు పడ్డాడు. ఢిల్లీలో ఓ చిన్న కేఫ్, రెస్టారెంట్స్ పాటలు పాడేవాడు. అలా నెలకు కేవలం రూ.5000 వరకు సంపాదించేవాడు. అంటే రోజుకి రూ.150 అన్నమాట. కొన్నిసార్లు సరైన తిండి కూడా లేని రోజులు గడిపినట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. పాటలు పాడితే సక్సెస్ కాదు కదా.. జీవించే పరిస్థితి లేదని ఆ ప్రొఫేషన్ కి గుడ్ బై చెప్పాడు. తర్వాత పేరడీ వీడియోలు చేస్తూ యూట్యూబ్ పోస్ట్ చేయడం.. అవి కాస్త వైరల్ కావడంతో ‘బీబీ కి వైన్స్’ పేరు తో యూట్యూబ్ ప్రారంభించి అద్భుత విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ‘బీబీ కి వైన్స్’ ఛానల్ కి 26 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌ ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం భువన్ బామ్ ఆస్తుల విలువ దాదాపు రూ.122 కోట్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నారు. 2018 సంవత్సరంలో 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సాధించిన మొట్టమొదటి యూట్యూబర్ గా రికార్డులు క్రియేట్ చేశారు.