iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రముఖ కమెడియన్‌ యోగిబాబుకు చేదు అనుభవం!

  • Published Aug 08, 2023 | 8:55 AM Updated Updated Aug 08, 2023 | 8:55 AM
  • Published Aug 08, 2023 | 8:55 AMUpdated Aug 08, 2023 | 8:55 AM
వీడియో: ప్రముఖ కమెడియన్‌ యోగిబాబుకు చేదు అనుభవం!

తెలుగు ప్రేక్షకులకు కమెడియన్‌ యోగిబాబు గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందారు. ఆయన తన కామెడీ టైమింగ్‌, పెక్యులర్‌ డైలాగ్‌ డెలివరీ కారణంగా ఇట్టే గుర్తుండిపోతారు. యోగిబాబు తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేశారు. తమిళంలో మాత్రం టాప్‌ కమెడియన్‌గా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరుకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు. అవి కూడా స్టార్‌ హీరోల ప్రాజెక్టులు కావటం విశేషం. సూర్యతో ‘కంగువ’.. విశాల్‌తో ‘విశాల్‌ 34’ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.

ప్రస్తుతం యోగిబాబుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు ఆ వీడియోలో ఉన్న పూజారిపై ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం యోగిబాబు తమిళనాడులోని ఓ‍ ప్రసిద్ధ దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజలు చేయించారు. ప్రముఖ నటుడు కావటంతో యోగిబాబుకు దేవాలయ మర్యాదలతో పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం వచ్చింది. తర్వాత ఆయన తనతో ఫొటో దిగటానికి వచ్చిన వారితో ఫొటోలు దిగారు.

ఆ వెంటనే ఆలయ పూజారి దగ్గరకు వెళ్లారు. పూజారితో కరచాలనం చేసే ప్రయత్నం చేశారు. యోగిబాబు తన చెయ్యి పూజారికి అందించారు. అయితే, పూజారి మాత్రం యోగిబాబుకు చెయ్యి ఇవ్వలేదు. నమస్కారం చేశారు. అయినప్పటికి యోగిబాబు పట్టించుకోలేదు. పూజారితో ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో.. సదరు పూజారి ప్రవర్తనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పూజారి యోగిబాబును అవమానించేలా ప్రవర్తించారని అంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలను వారు చేస్తున్నారు. మరి, సదరు పూజారి యోగిబాబుకు చెయ్యి ఇవ్వకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet