iDreamPost
android-app
ios-app

Yatra 2: సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా యాత్ర 2 పోస్టర్‌ రిలీజ్‌!

  • Published Dec 21, 2023 | 3:35 PM Updated Updated Dec 21, 2023 | 3:35 PM

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదలైంది.

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదలైంది.

  • Published Dec 21, 2023 | 3:35 PMUpdated Dec 21, 2023 | 3:35 PM
Yatra 2: సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా యాత్ర 2 పోస్టర్‌ రిలీజ్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయ జీవితం నేపథ్యంలో ‘యాత్ర 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర మూవీకి దర్శకత్వం వహించిన మహీ వీ రాఘవ యాత్ర 2కు దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ మొదలైనట్లు సమాచారం. యాత్ర సినిమాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించారు. యాత్ర వైఎస్సార్‌ రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కింది.

యాత్ర 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూవీకి మంచి స్పందన లభించింది. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. వైఎస్సార్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటించారు. సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, గౌరు సుచరితా రెడ్డిగా అనసూయ భరద్వాజ్‌, కేవీపీ రామచంద్రరావుగా రావు రమేష్‌ నటించి మెప్పించారు. యాత్రలో వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్ర ప్రధానంగా ఉంటుంది. వైఎస్సార్‌ పాదయత్ర సందర్భంగా ప్రజలతో మమేకమైన తీరును దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ‘‘ ప్రజా సంకల్ప యాత్ర’’ ప్రధానంగా యాత్ర 2 ఉండనుంది. వైఎస్‌ జగన్‌ వేల కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. యాత్ర 2లో కూడా మమ్ముట్టి పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి వైఎస్సార్‌గా కనిపించి కనువిందు చేయనున్నారు. ఇక, ఈ సినిమాకు త్రీ ఆటమ్స్‌ లీవ్స్‌, వీ సెల్యులాయిడ్‌, శివ మేక సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజును పురష్కరించుకుని దర్శకుడు మహి వీ రాఘవ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. ఈ మేరకు గురువారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ వాళ్లు అది అంతం అని అనుకున్నారు. కానీ, అతడికి తెలుసు అది కేవలం ఆరంభం మాత్రమే అని. వైఎస్‌ జగన్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా లెన్స్‌తో మీ స్టోరీని ప్రపంచానికి చెబుతాను. యాత్ర 2 2024 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని పేర్కొన్నాడు.

ఇక, పోస్టర్‌లో వైఎస్‌ జగన్‌ పాత్రలో నటిస్తున్న జీవా ఓ కుర్చీలో.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాత్రలో నటించిన మమ్ముట్టి మరో కుర్చీలో కూర్చుని ఉన్నారు. ‘‘ నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకోండది. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని’’ అని రాసి ఉంది. మరి, యాత్ర 2 వైఎస్‌ జగన్‌ పోస్టర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio