iDreamPost
android-app
ios-app

KGF చేయకుండా ఉండాల్సింది! యశ్ కి ప్రశాంతత లేదా?

  • Published Nov 25, 2023 | 1:32 PM Updated Updated Nov 25, 2023 | 1:32 PM

కేజీఎఫ్‌ సినిమాతో యశ్‌ క్రేజ్‌ ఆకాశానికి అంటింది. ఆయన తీసే తర్వాతి సినిమాపైనే అందరి చూపు పడింది. యశ్‌ కూడా తన తర్వాతి సినిమా మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టారు...

కేజీఎఫ్‌ సినిమాతో యశ్‌ క్రేజ్‌ ఆకాశానికి అంటింది. ఆయన తీసే తర్వాతి సినిమాపైనే అందరి చూపు పడింది. యశ్‌ కూడా తన తర్వాతి సినిమా మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టారు...

  • Published Nov 25, 2023 | 1:32 PMUpdated Nov 25, 2023 | 1:32 PM
KGF చేయకుండా ఉండాల్సింది! యశ్ కి ప్రశాంతత లేదా?

యశ్‌ జీవితం.. కేజీఎఫ్‌ సినిమాకు ముందు.. కేజీఎఫ్‌ సినిమా తర్వాత అని చెప్పుకోవచ్చు. కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 రిలీజవ్వటానికి ముందు వరకు ఆయన ఓ కన్నడ సూపర్‌ స్టార్‌. అభిమానులు ఆయన్ని రాకింగ్‌ స్టార్‌ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కన్నడలో ఆయనకు ఎన్ని సూపర్‌ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నా.. ఆయన పేరు పెద్దగా బయటి ప్రపంచానికి తెలీదు. సీరియళ్లతో యశ్‌ నటనారంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 20 సినిమాలు చేస్తే అందులో పదికిపైగా బ్లాక్‌ బాస్టర్‌, సూపర్‌, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.

కేజీఎఫ్‌ చాప్టర్‌ 1కు ముందు 2016లో ఆయన ‘ సంతు స్ట్రైట్‌ ఫార్వడ్‌’ అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘కేజీఎఫ్‌’ సినిమా చేశారు. ఇది ప్యాన్‌ ఇండియా సినిమా అవుతుందని, ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుందని ప్రశాంత్‌ నీల్‌, యశ్‌ ఎవ్వరూ ఊహించలేదు. రాజమౌళి స్పూర్తితో ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ చేశారు. సినిమాకు ఊహించని స్పందన వచ్చింది.

మంచి వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే చాప్టర్‌ 2కు కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దేశ వ్యాప్తంగా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. దాదాపు 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అదే విధంగా యశ్‌ స్టార్‌డమ్‌ ఊహించని పీక్స్‌కు చేరుకుంది. రాకీ భాయ్‌కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఏర్పడ్డారు. ఇక, రాకీ భాయ్‌ తర్వాతి సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.

యశ్ కి ప్రశాంతత లేదా?..

యశ్‌ సినిమా తర్వాత తనపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో యశ్‌కు బాగా అర్థమైంది. తన తర్వాత సినిమా ‘కేజీఎఫ్‌’ సినిమాలను మించి ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే కథల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఆయన సినిమా తీయకుండా సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరం మొత్తం ఆయన కథలు వినటంలోనే గడిపేశారు. తన ప్యాన్‌ ఇండియా స్టార్‌డమ్‌కు తగ్గ స్టోరీలు రాకపోవటం.. వచ్చిన స్టోరీలు ఆయనకు నచ్చకపోవటంతో యశ్‌కు ప్రశాంతత కరువైంది.

ఓ లేడీ దర్శకురాలితో ఓ సినిమా.. బాలీవుడ్‌లో రామాయణంలో నటించే అవకాశాలు యశ్‌ చేతిలో ఉన్నాయి. అయితే, వాటి విషయంలో యశ్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నారంట. యశ్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సినిమా అప్‌డేట్‌ రాకపోవటంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఏదో ఒక సినిమా చేయాలని ఆశపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా యశ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి, కేజీఎఫ్‌ సాధించిన సంచలన విజయం కారణంగా యశ్‌ ప్రశాంతత కోల్పోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet