P Krishna
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో విషాదంలో మునిగిపోతున్నారు.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో విషాదంలో మునిగిపోతున్నారు.
P Krishna
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదలు చోటు చేసుకోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. కొత్త సంవత్సరంలో ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. డిసెంబర్ లో ప్రముఖ తమిళ హీరో విజయ్ కాంత్ కన్నుమూశారు. ఈ ఏడాది మొదటి వారంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ తన ఇద్దరు కూతుళ్లతో సహ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన మరువక ముందే హాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
‘X-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ ’ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ భరిత చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నటించిన ప్రతి నటీనటులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా X-మెన్ మూవీలో నటించిన అడాన్ కాంటో(42) కన్నుమూశారు. గత కొంత కాలంగా అపెండిషియల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. మెక్సికోలో డిసెంబర్ 5, 1981 జోస్ లూయిస్ నార్వేజ్, మార్లిన్ కాంట్ లకు జన్మించాడు. అడాన్ కాంటో హిస్పానిక్ జాతికి చెందివారు. అడాన్ కాంటో 2017లో అతని జాతి హిస్పానిక్. ఆడమ్ కాంటో యొక్క రాశిచక్రం ధనుస్సు. అతని జాతీయత మెక్సికన్. కాంటో మెక్సికో సిటీలో గాయకుడు-గేయరచయితగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకున్నాడు.
హాలీ బెర్రీ దర్శకత్వం వహించిన “బ్రూజ్డ్”తో సహా పలు టీవీ కార్యక్రమాలు, చిత్రాలలో నటించాడు. 2014లో తన మొదటి ఓ షార్ట్ ఫిలిమ్ కి దర్శకత్వం వహించాడు. అడాన్ కాంటో మరణించే కొద్ది రోజుల ముందు “ది క్లీనింగ్ లేడీ”లో అర్మాండ్ మోరేల్స్‌గా నటించారు. ప్రస్తుతం ఇది మూడవ సీజన్ చిత్రీకరణలో ఉంది. అనారోగ్యం కారణంగా ప్రొడక్షన్‌లో పాల్గొనలేకపోయాడు. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ.. అందిరతో ఎంతో సంతోషంగా ఉండే అడాన్ కాంటో కన్నుమూయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా శోయ సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ సెలబ్రెటీలు ఆయనకు నివాళులర్పించారు.
Adan Canto has sadly passed away from appendiceal cancer at 42. pic.twitter.com/bcHxRBOMFV
— The DisInsider (@TheDisInsider) January 9, 2024