iDreamPost
android-app
ios-app

తన ఫస్ట్ లవ్ గురించి విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Author Soma Sekhar Updated - 02:12 PM, Tue - 4 July 23
  • Author Soma Sekhar Updated - 02:12 PM, Tue - 4 July 23
తన ఫస్ట్ లవ్ గురించి విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తొలిప్రేమ.. పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా గురించి కాదండి బాబు ఇప్పుడు చెప్పబోయేది. ప్రతి మనిషికి తొలిప్రేమ(ఫస్ట్ క్రష్) ఉంటుంది. అది పసితనంలో కావొచ్చు.. కాలేజీలో కావొచ్చు. ఎన్ని సంవత్సరాలు అయిన వారు తమ ఫస్ట్ క్రష్ ను మర్చిపోలేరు. ఇక కొన్ని తొలిప్రేమలు పెళ్లిదాక వెళ్తే.. మరొకొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. అయితే జీవితంలో మాత్రం తొలిప్రేమను మర్చిపోలేరు కొందరు. నీ ఫస్ట్ క్రష్ ఎవరు అంటే ఠక్కున పేరు చెప్పేస్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ రైటర్, రాజ్యసభ్య ఎంపీ విజయేంద్రప్రసాద్ తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.’ఓ సాథియా’ మూవీ టీమ్ తో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా.. తన ఫస్ట్ లవ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

విజయేంద్రప్రసాద్.. స్టార్ రైటర్ గా టాలీవుడ్ లోనే కాక.. ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు దాదాపుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు ఆయనే కథను అందించారు. తాజాగా రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న అడ్వెంచరల్ మూవీకి కథను అందించడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఓ సాథియా’ మూవీ టీమ్ తో ఆయన తాజాగా చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ఫస్ట్ క్రష్ పేరును చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ఈ క్రమంలోనే ఓ సాథియా టీమ్ విజయేంద్రప్రసాద్ ఫస్ట్ లవ్ గురించి ప్రశ్నించగా.. ఆయన తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఫోర్త్ ఫారం ట్యూషన్ క్లాస్ తో తనను రోజూ చూస్తుండే వాడినని, తను నాకన్నా నాలుగు సంవత్సరాలు పెద్దదని చెప్పుకొచ్చారు. ఇక నేను ఆమెను చూస్తుండం చూసి.. సార్ కు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. ఆ అమ్మాయి పేరు రాధ అంటూ నవ్వులు చిందించారు విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో పలువురు అభిమానులు మీరు కూడా గొప్ప ప్రేమికుడే సార్ అంటూ కామెంట్స్ చేసుకొచ్చారు.