iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి అవమానాలు దాటుకుని.. ఇప్పుడు టాప్‌ స్టార్‌గా ఎదిగింది!

  • Published Mar 08, 2024 | 6:41 PM Updated Updated Mar 08, 2024 | 6:41 PM

ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అన్నింటిని దాటుకుని.. ఇప్పుడు టాప్‌ స్టార్‌గా ఎదిగింది. ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..

ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అన్నింటిని దాటుకుని.. ఇప్పుడు టాప్‌ స్టార్‌గా ఎదిగింది. ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..

  • Published Mar 08, 2024 | 6:41 PMUpdated Mar 08, 2024 | 6:41 PM
ఈ చిన్నారి అవమానాలు దాటుకుని.. ఇప్పుడు టాప్‌ స్టార్‌గా ఎదిగింది!

మన సమాజంలో బాడీ షేమింగ్‌ సర్వ సాధారణంగా మారింది. ఆడామగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో బాడీ షేమింగ్‌కు గురవుతూనే ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో.. అందునా మహిళలు ఎక్కువగా బాడీ షేమింగ్‌ బారిన పడతారు. పరిశ్రమలో కొందరు ఎంత నీచానికి దిగజారుతారు అంటే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ మీద కూడా విమర్శలు చేస్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో బాడీ షేమింగ్‌కు గురైన వాళ్లే. ఇక పైన ఫొటోలో ఏడుస్తూ కూడా క్యూట్‌గా ఉన్న చిన్నారిని చూశారా.. ప్రజెంట్‌ ఆ పాప టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ యాంకర్‌. సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. పరిశ్రమకు వచ్చిన కొత్తలో విపరీతమైన బాడీ షేమింగ్‌కు గురైంది. అయినా సరే తల్లి మద్దతు ఉండటంతో.. వాటన్నింటిని దాటుకుని.. నేడు టాప్‌ యాంకర్‌గా రాణిస్తోంది. ఇంతకు చిన్న పాప ఎవరో గుర్తు పట్టారా.. లేదా..

ఫొటోలో తల్లి చేతిలో ఏడుస్తూ.. క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి మరేవరో కాదు.. తెలుగులో టాప్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి. ఎప్పుడూ నవ్విస్తూ.. నవ్వుతూ.. స్పాంటేనియస్‌గా జోకులు వేస్తూ.. గల గల మాటలు చెబుతూ.. షోలను రక్తి కట్టిస్తూ.. టాప్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. వ్యాఖ్యతగా మాత్రమే కాక.. సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది శ్రీముఖి. అంతేకాక బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కూడా పార్టిసిపేట్‌ చేసింది. ఈ క్రమంలో ఉమెన్స్‌ డే సందర్భంగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది శ్రీముఖి. తన తల్లి గురించి చెబుతూ చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతుంది.

‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన అందమైన రూపం మా అమ్మదే. ఏమి లేని స్థాయి నుంచి.. ఇక్కడి వరకు ఆమె సాగించిన ఈ ప్రయాణం.. నాలో స్ఫూర్తిని నింపింది. అమ్మ ప్రోత్సాహం వల్లే నేను నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. అమ్మ వల్లే నేడు ఎన్నో లక్షల మంది అభిమానులకు చేరువయ్యాను. మా అమ్మ పల్లెటూరిలో పుట్టిపెరిగింది.. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ తను కన్న కలలను ఎన్నడూ వదులుకోలేదు. అంకితభావంతో బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకుని.. సాధారణ మహిళ స్థాయి నుంచి నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది’’ అని రాసుకొచ్చింది.

‘‘నాకోసం, కుటుంబ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నాకు సంబంధించి ఏ విషయంలో కూడా ఎప్పుడూ నో చెప్పలేదు. నేను లావుగా ఉన్నానని అందరూ నన్ను వెక్కిరించినప్పుడు.. తనే నాకు అండగా నిలబడింది. నాపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఎంతో ఎంకరేజ్‌ చేసి.. నన్ను బలవంతురాలిగా నిలబెట్టింది. త్వరలో మా అమ్మకు 50 ఏళ్లు నిండబోతున్నాయి. ఇప్పటికీ తను నన్ను ప్రతిరోజు ఇన్‌స్పైర్‌ చేస్తూనే ఉంది. నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ మమ్మా.. ఐ లవ్యూ మమ్మా..’’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet