iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ లో అయినా బ్లాక్ బస్టర్ పడుతుందా !

  • Published Sep 03, 2025 | 3:37 PM Updated Updated Sep 03, 2025 | 3:37 PM

సినిమా సూపర్ హిట్ , సినిమా బ్లాక్ బస్టర్ అనే మాటలు వినిపించి చాలా రోజులే అయింది. ప్రతి వారం ఈ వారం కచ్చితంగా మా హీరో సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకుని సినిమాకు వెళ్తున్నారు అభిమానులు. తీరా చూస్తే అభిమానుల ఆశలు నీరు కారిపోతున్నాయి. భారీ అంచనాలు పెట్టుకుని సినిమాలకు వెళ్లడం.. ఆ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచడం. గత కొన్ని నెలలుగా ఇదే జరుగుతుంది.

  • Published Sep 03, 2025 | 3:37 PMUpdated Sep 03, 2025 | 3:37 PM
సెప్టెంబర్ లో అయినా బ్లాక్ బస్టర్ పడుతుందా !

సినిమా సూపర్ హిట్ , సినిమా బ్లాక్ బస్టర్ అనే మాటలు వినిపించి చాలా రోజులే అయింది. ప్రతి వారం ఈ వారం కచ్చితంగా మా హీరో సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకుని సినిమాకు వెళ్తున్నారు అభిమానులు. తీరా చూస్తే అభిమానుల ఆశలు నీరు కారిపోతున్నాయి. భారీ అంచనాలు పెట్టుకుని సినిమాలకు వెళ్లడం.. ఆ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచడం. గత కొన్ని నెలలుగా ఇదే జరుగుతుంది. పెద్ద హీరోల సినిమాల విషయంలో సైతం ఇదే జరుగుతుంది. ఇక కనీసం సెప్టెంబర్ లో అయినా బ్లాక్ బస్టర్ పడుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు. పైగా సెప్టెంబర్ నెల చాలా కీలకం. భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్స్ ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి.

అందులో ఈ వారం ఘాటీ సినిమా రానుంది. ప్రమోషన్స్ లో ఎక్కడా అనుష్క బయటకు రావడం లేదు కానీ.. సినిమా ప్రచారం మాత్రం ఘాటుగానే సాగుతుంది. కథలో కంటెంట్ కూడా ఇలాంటి టాక్ తెచ్చుకుంటే బానే ఉంటది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా తేజ సజ్జ నుంచి వచ్చిన హనుమాన్ ఎంత హిట్ అయిందో తెలియనిది కాదు. ఇప్పుడు అదే హీరో నుంచి మిరాయ్ మూవీ వచ్చే వారం రంగంలోకి దిగుతుంది. ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా ఉంది. సో ఈ సినిమా కూడా హిట్ అందుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ లెక్కలు మెల్లగా ఊపందుకోవడం ఖాయం.

ఇవన్నీ ఇలా ఉంటె నెల ఆఖరిలో ఈ నెల లెక్కలే కాదు ఈ సంవత్సరం లెక్కలన్నీ సరిచేయడానికి.. ఓజి తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు సినిమా స్టార్ట్ చేయకముందే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ అభిమానులు ఓజి జపం చేస్తూనే ఉన్నారు. సో బాక్స్ ఆఫీస్ జాతకాన్ని మార్చేసే సినిమా ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ నెలలో అయినా బ్లాక్ బస్టర్ పడుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.