iDreamPost
android-app
ios-app

రాజమౌళి రేంజ్ లో సందీప్ రెడ్డి వంగా కూడా ఇండస్ట్రీని రూల్ చేస్తాడా !

  • Published Sep 22, 2024 | 10:49 AM Updated Updated Sep 22, 2024 | 10:49 AM

Rajamouli- Sandeep Reddy Vanga: ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కు ఈయన ఒక ఇన్స్పిరేషన్. ఇక ఆ తర్వాత బడా దర్శకుల లిస్ట్ లో వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. మరి సందీప్ కూడా రాజమౌళి రేంజ్ లో ఇండస్ట్రీని రూల్ చేస్తాడా.. ఆ వివరాలు చూసేద్దాం.

Rajamouli- Sandeep Reddy Vanga: ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కు ఈయన ఒక ఇన్స్పిరేషన్. ఇక ఆ తర్వాత బడా దర్శకుల లిస్ట్ లో వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. మరి సందీప్ కూడా రాజమౌళి రేంజ్ లో ఇండస్ట్రీని రూల్ చేస్తాడా.. ఆ వివరాలు చూసేద్దాం.

  • Published Sep 22, 2024 | 10:49 AMUpdated Sep 22, 2024 | 10:49 AM
రాజమౌళి రేంజ్ లో సందీప్ రెడ్డి వంగా కూడా ఇండస్ట్రీని రూల్ చేస్తాడా !

ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రాజమౌళితో సినిమా అంటే బడా స్టార్స్ సైతం ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా బల్క్ లో డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇటు ఆ హీరో అభిమానులు కూడా జక్కన్న దర్శకత్వంలో మూవీ అంటే.. మూవీ రిలీజ్ ఎంత లేట్ అయినా కూడా.. అదే ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే రాజమౌళి కాస్త లేట్ అయినా సరే.. కంటెంట్ తో పక్కా హిట్ కొడతాడనే నమ్మకం. ఈ రేంజ్ లో ఈ దర్శకుడిపై అందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో బజ్ వినిపిస్తున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సందీప్ రెడ్డి వంగా మాత్రమే. ఈ డైరెక్టర్ తో ఒక్క సినిమా అయినా చేయాలనీ స్టార్స్ వెయిట్ చేస్తున్నారట. ఆ వివరాలేంటో చూసేద్దాం.

సందీప్ రెడ్డి వంగా… అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా మారాడు. కబీర్ సింగ్ తో హిట్ కొట్టాడు. యానిమల్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. సందీప్ కథ చెప్పే విధానం చాల డిఫరెంట్ గా ఉంటుంది. అతను డిసైన్ చేసే హీరో రోల్స్ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఇక కంటెంట్ ను చాలా బలమైన క్యారెక్టర్స్ తో ఎలివేట్ చేయడంతో.. ప్రతి ఒక్కరు త్వరగా కనెక్ట్ అవుతారు. అందుకే సందీప్ రెడ్డి తో సినిమా చేయడానికి స్టార్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం సందీప్ – ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సందీప్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ను కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇక మహేష్ కూడా రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యాక.. సందీప్ తో మూవీకి ఓకే చెప్పనున్నారు. అలానే ఆల్రెడీ రీసెంట్ గా తారక్ కూడా సందీప్ రెడ్డితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కూడా త్వరలోనే సందీప్ తో మాట్లాడనున్నారట. ఈ స్టార్స్ కాకుండా అటు బాలీవుడ్ లో యానిమల్-2 ఎలానూ ఉంది.

దీనిని బట్టి చూస్తే తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా.. సందీప్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థంచేసుకోవచ్చు. కాబట్టి సందీప్ కనుక సినిమా చేస్తాను అంటే.. స్టార్స్ అంతా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇలా మొత్తానికి రాజమౌళితో మూవీ చేసిన వారంతా కూడా సందీప్ తో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఆ స్టాండర్డ్స్ ను సందీప్ అందుకుంటాడా.. రాజమౌళి లా సందీప్ కూడా ఫ్యూచర్ లో ఇండస్ట్రీని రూల్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే అటు రాజమౌళి మహేష్ మూవీతో.. ఇటు సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ మేకింగ్ తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ రెండు మూవీస్ కు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో.. ప్రేక్షకులలో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş