రవితేజ ధమాకా చుట్టూ పోటీ వ్యూహం

మాస్ మహారాజా రవితేజ ధమాకా ఈ నెల 23న విడుదల కానుంది. అభిమానులకు దీని మీద చాలా ఆశలున్నాయి. ఇందులో తను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయిలో డబుల్ ఫోటోతో రవితేజ మళ్ళీ మెప్పించలేకపోయాడు. డ్యూయల్ షేడ్స్ ఉన్నవి చేశారు కానీ అవేవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. నేను లోకల్ తో న్యాచురల్ స్టార్ ని మాస్ టచ్ ఇచ్చిన త్రినాధరావు నక్కినకు ఆ తర్వాత రామ్ తో తీసిన హలో గురు ప్రేమ కోసమే జస్ట్ యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని విశ్వప్రయత్నం చేశారు కానీ ఫైనల్ వెర్షన్ సెట్ కాకపోవడంతో వేరే కథతో రవితేజతో ఓకే అయ్యింది

ధమాకాకు పలు రకాల ఒత్తిడి ఉంది. క్రాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మాస్ రాజా చేసిన ఖిలాడీ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. సరే ఇది మాములే అనుకుంటే ఎంతో ప్రమోషన్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ సైతం అదే బాట పట్టింది. అందుకే ధమాకా ఆడితేనే మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. అయితే ఈ సినిమాకు పోటీ మాములుగా లేదు. ఒక రోజు ముందు విశాల్ లాఠీ, నయనతార కనెక్ట్ డబ్బింగ్ వెర్షన్లు వస్తున్నాయి. వీటి మీద భీభత్సమైన అంచనాలు లేవు కానీ కంటెంట్ బాగుందని టాక్ వస్తే ఆటోమేటిక్ గా పికప్ అవుతాయి. రవితేజ వచ్చే రోజే నిఖిల్ 18 పేజెస్ రెడీ అవుతోంది. దీని మీదా బజ్ లేదు కానీ గీతా ఆర్ట్స్ కాబట్టి మార్కెటింగ్ వరకు ఏదో మేజిక్ చేస్తారు

బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ సర్కస్ భారీ ఎత్తున 23నే వస్తోంది. తెలుగు వెర్షన్ ని సైతం సిద్ధం చేస్తున్నారు. మాస్ కామెడీని డీల్ చేయడంలో సిద్ధహస్తుడైన రోహిత్ శెట్టి దర్శకుడు కావడంతో సర్కస్ మీద మంచి హైప్ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డిసెంబర్ 16న వస్తున్న అవతార్ 2 ది వే టు వాటర్ కి అది రెండో వారం. పాజిటివ్ టాక్ వచ్చిందా కనీసం మూడు వారాలు స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుంది. అప్పుడు క్రిస్మస్ కు వచ్చే ధమాకా లాంటి చిత్రాలకు కొంత ఇబ్బంది తప్పదు. టీజర్ లో ఎప్పటిలాగే ఎనర్జీతో అదరగొట్టిన రవితేజ ధమాకాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి సందడి తర్వాత తను నటిస్తున్న పెద్ద మూవీ ఇదే.

Show comments