Swetha
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన కాంతార.. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక ఈ సినిమాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. మధ్యలో ఈ సినిమాకు ఎన్నో ఆటంకాలు ప్రమాదాలు ఎదురైనా సంగతి తెలిసిందే

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన కాంతార.. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక ఈ సినిమాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. మధ్యలో ఈ సినిమాకు ఎన్నో ఆటంకాలు ప్రమాదాలు ఎదురైనా సంగతి తెలిసిందే. అయినా సరే ఎక్కడ వెనకడుగు వేయకుండా సినిమాను రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేసి.. సినిమాను కంప్లీట్ చేశారట. ఇక బిజినెస్ రూపంలో కూడా ఎంతో ఎత్తులో ఉందని తెలుస్తుంది.
ఏపీ తెలంగాణ బిజినెస్ విషయానికొస్తే… ఒక నైజాంలోనే మూవీ 40 కోట్ల వరకు కోట్ చేసిందట. ఆంధ్రలో 45 కోట్లు , సీడెడ్ లో 15 కోట్ల వరకు కోట్ చేసినట్టు సమాచారం. కొంచెం అటు ఇటుగా ఈ నెంబర్స్ లోనే బిజినెస్ డీల్ క్లోజ్ అవ్వనున్నట్లు సమాచారం. సో ఎంత లేదన్న ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 రెండు తెలుగు రాష్ట్రాలలో 170 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. ఇక మొదటి పార్ట్ లానే ఇది కూడా ఎక్సట్రార్డినరి టాక్ వస్తే కనుక.. మిగిలినవి బోనస్.
ప్రస్తుతానికైతే ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు. నిజంగా ఈ సినిమాకు ఇంత డిమాండ్ ఉందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఓజి కి ఎంత హైప్ ఉందొ తెలియనిది కాదు. ఈ సినిమా రిలీజ్ అయిన వారానికే కాంతార రిలీజ్ అవ్వడం గమనార్హం. ఓజి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక కనీసం పది రోజులు ఊచకోత కన్ఫర్మ్. దానిని తట్టుకుని కాంతార నిలబడాలి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.