iDreamPost
android-app
ios-app

Nani: వరుసగా సూపర్ హిట్స్.. అయినా లుక్ మార్చని నాని! కారణం?

  • Published Sep 05, 2024 | 4:39 PM Updated Updated Sep 06, 2024 | 11:44 AM

Why Nani not changing his look: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, లేటెస్ట్ గా సరిపోదా శనివారం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నప్పటికీ.. నాని తన లుక్ ను మాత్రం మార్చడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే..

Why Nani not changing his look: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, లేటెస్ట్ గా సరిపోదా శనివారం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నప్పటికీ.. నాని తన లుక్ ను మాత్రం మార్చడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే..

Nani: వరుసగా సూపర్ హిట్స్.. అయినా లుక్ మార్చని నాని! కారణం?

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమా.. సినిమాకు డిఫరెంట్ మేకోవర్ తో అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తుంటారు మన హీరోలు. కానీ.. న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాడు. వరుసగా హ్యాట్రిక్స్ సాధించినా గానీ.. తన లుక్ ని మాత్రం మార్చడం లేదు. అలా అని సినిమాలు నిరాశపరుస్తున్నాయా? అంటే అదీ లేదు. వరుసగా సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి మన న్యాచురల్ స్టార్ లుక్ మార్చకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

న్యాచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, 2008లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చెమ్మ’ మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత భీమిలీ కబడ్డి జట్టు, పిల్ల జమిందార్, ఈగ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేసుకుంటూ.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే మధ్య మధ్యలో కొన్ని విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశాడు. మంచి కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న నాని.. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనకడు వేయడు.

ఇక హాయ్ నాన్న లాంటి క్లాస్ మూవీస్ తో పాటుగా దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నాడు న్యాచురల్ స్టార్. పైగా కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంలో న్యాచురల్ స్టార్ ముందుంటాడు. అయితే నాని ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి సేమ్ లుక్ తోనే చిత్రాలు చేస్తూ, విజయాలు సాధిస్తూ.. వస్తున్నాడు. తాజాగా హిట్ 3 నుంచి విడుదలైన అర్జున్ సర్కార్ లుక్ రా అండ్ రస్టిక్ గా ఉన్నప్పటికీ.. గతంలో వచ్చిన ‘వి’ మూవీ లుక్ ను పోలి ఉందని కొందరు అంటున్నారు. ఈ క్రమంలో వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నప్పటికీ.. నాని తన లుక్ మార్చకపోవడానికి కారణం ఏంటి? అంటూ ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. అయితే ఆయన లుక్ మార్చకపోవడానికి పెద్దగా రీజన్స్ ఏమీ లేవు.

ఓ సినిమాకు హీరో లుక్ ప్లస్ పాయింట్ అవుతుందా? అంటే అవుతుందనే చెప్పాలి. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. పైగా లుక్ తోనే హీరోలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటారు, సినిమాపై అంచనాలు పెంచుతారు. అయితే న్యాచురల్ లుక్ తో హిట్లు కొట్టిన హీరోలు లేరని కాదు. కథ డిమాండ్ చేస్తే లుక్ మార్చడానికి స్టార్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ప్రస్తుతం నాని తన డీసెంట్ లుక్స్ తోనే హిట్లు కొడుతూ వస్తున్నాడు. ఇక తన దగ్గరికి వెరైటీ కథలు వచ్చినప్పటికీ.. తాను మాత్రం లుక్స్ మార్చకుండా అదే లుక్ లో సూపర్ హిట్స్ కొడుతున్నాడు. అభిమానులు మాత్రం న్యాచురల్ స్టార్ ను కొత్త మేకోవర్ లో చూడాలని కోరుకుంటున్నారు. వారి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. కాగా.. మిగతా స్టార్ హీరోలందరూ డిఫరెంట్ గా, ప్రయోగాత్మకంగా కనిపిస్తున్నారు, మరికొందరు అలా కనిపించడానికి రెడీ అవుతున్నారు. మరి ఇతర హీరోల మాదిరే నాని కూడా ఇకపై తన లుక్ పై కేర్ తీసుకుంటాడేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş