Dharani
సోషల్ మీడియా, మీడియాలో నిన్నటి నుంచి మారుమోగుతున్న పేరు విచిత్ర. కోలీవుడ్ సీనియర్ యాక్టర్, తమిళ్ బిగ్‌బాస్ సీజన్ కంటెస్టెంట్ అయిన విచిత్ర.. టాలీవుడ్ టాప్ హీరో మీద లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. ఇంతకు ఎవరీ విచిత్ర.. ఆమె చేసిన ఆరోపణలు ఏంటి అంటే..
సోషల్ మీడియా, మీడియాలో నిన్నటి నుంచి మారుమోగుతున్న పేరు విచిత్ర. కోలీవుడ్ సీనియర్ యాక్టర్, తమిళ్ బిగ్‌బాస్ సీజన్ కంటెస్టెంట్ అయిన విచిత్ర.. టాలీవుడ్ టాప్ హీరో మీద లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. ఇంతకు ఎవరీ విచిత్ర.. ఆమె చేసిన ఆరోపణలు ఏంటి అంటే..
Dharani
క్యాస్టింగ్ కౌచ్.. యావత్ భారదేశ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలక్కిపడేలా చేసింది. తెర మీద కనిపించే నటీనటుల తెర వెనక రూపం.. వారు చేసే అకృత్యాలను ఈ క్యాస్టింగ్ కౌచ్ బట్టబయలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం జనాల్లో ఉంది. దానికి తగ్గట్టే మీటూ ఉద్యమం వచ్చిన సమయంలో చాలా మంది బాధితులు బయటకు వచ్చి.. తాము ఎదుర్కొన్న ఇబ్బందులు వేధింపులు గురించి వెల్లడిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మన్సూర్ అలీ ఖాన్.. స్టార్ హీరోయిన్ త్రిష మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేగింది. ఈ వివాదం ముగియకముందే.. తాజాగా తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ విచిత్ర.. క్యాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
విక్టరీ వెంకటేష్ ‘పోకిరి రాజా’, నందమూరి బాలకృష్ణ ‘భలే వాడివి బాసు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది విచిత్ర. ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్’ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఓ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లు తమ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పాలనే టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా విచిత్ర మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది.
హీరో పేరు చెప్పకుండా అతడు తనను ఎలా వేధింపులకు గురి చేశాడో వివరించింది. సుమారు 23 ఏళ్ల క్రితం ఓ తెలుగు సినిమా షూటింగ్ సందర్భంగా ఓ స్టార్ హీరో కనీసం తన పేరు కూడా అడక్కుండా.. అతడి రూమ్‌కి రమ్మన్నాడని.. తాను అందుకు అంగీకరించకపోవడంతో.. తరువాతి రోజు నుంచి తనకు నరకం చూపించారని చెప్పుకొచ్చింది. దీని గురించి ఫిర్యాదు చేస్తే తననే కొట్టారని.. కోర్టుకు వెళ్లినా లాభం లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకు ఎవరీ విచిత్ర.. ఈమె తెలుగులో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది.. ఏ సినిమా చేసే సమయంలో ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నది అంటూ నెటిజనులు ఆరా తీస్తున్నారు. ఇక విచిత్ర విషయానికి వస్తే.. ఆమె ఆమె ప్రముఖ తమిళ నటి. అయితే తమిళ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. తొలిసారి పోర్కోడి అనే తమిళ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. తర్వాత 1992లో వచ్చిన అవల్ ఓరు వసంతం చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. 1995లో వచ్చిన పోకిరి రాజా తెలుగులో ఆమెకు తొలి సినిమా. ఆ తర్వాత 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన భలే వాడివి బాసు సినిమాలో కూడా కనిపించింది. తెలుగులో ఇదే ఆమెకు చివరి చిత్రం.
ఇక విచిత్ర వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె తండ్రి విలియమ్స్ నటుడు కాగా.. తల్లి మేరి వనిత. ఆమె తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె మాస్టర్ ఆఫ్ సైకోథెరపీ, కౌన్సెలింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరుడు ఉన్నారు. విచిత్ర షాజీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె.. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లి తెర మీద తన సత్తా చాటుతోంది. తమిళ, మలయాళం, తెలుగులో పలు సీరియల్స్‌లో నటిస్తూ.. టీవీషోలు చేస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతోంది.
ఇక విచిత్ర జీవితంలో చోటు చేసుకున్న విషాదాల్లో ముఖ్యమైంది ఆమె తండ్రి దారుణ హత్య. విచిత్ర తండ్రి విలయమ్స్ కూడా నటుటే. కానీ అతడు 2011, సెప్టెంబర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని చెల్లంపట్టరైలోని తన ఫామ్‌హౌస్‌లో జరిగిన దోపిడీ ఘటనలో విలియమ్స్ హత్యకు గురయ్యాడు.
ఇక ఆరోపణల విషయానికి వస్తే.. గతంలో విచిత్ర బాలకృష్ణ భలేవాడివి బాసు సినిమా షూటింగ్ సమయంలో.. ఆ మూవీ స్టంట్ డైరెక్టర్ ఎ. విజయ్ తనను వేధించాడని చెప్పుకొచ్చింది. దీనిపై న్యాయం కోసం ఆమె అప్పట్లో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్‌ను కూడా ఫిర్యాదు చేసింది.
ఇక తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లో తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్తూ.. హీరో తనను రూమ్‌కి రమ్మనడం.. ఆమె అంగీకరించకపోవడంతో.. వేధింపులకు గురి చేశారని.. అంతేకాక అడవిలో గిరిజనులతో షూటింగ్ చేసేటప్పుడు కొందరు కావాలనే తనను అసభ్యంగా తాకారని చెప్పుకొచ్చింది. దీని గురించి స్టంట్ డైరెక్టర్‌కి ఫిర్యాదు చేస్తే.. అందరి ముందు తనను కొట్టారని.. ఆ తర్వాత దీని గురించి కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసినా తనకు ఉపశమనం లభించలేదని పేర్కొన్నది. తాను సినిమాలు వదిలేయాడానికి ఇదే ప్రధాన కారణమని.. ఈ సంఘటన ఇప్పటికి తనను వెంటాడుతుందని చెప్పుకొచ్చింది.
విచిత్ర గతంలో స్టంట్ డైరెక్టర్ మీద ఇచ్చిన ఫిర్యాదు.. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో చేసిన కామెంట్స్ ఆధారంగా.. ఆమెను వేధింపులుకు గురి చేసిన హీరో బాలకృష్ణ అంటూ వార్తలు రాసుకొస్తున్నారు. ఇంగ్లీష్ సైట్ ఇండియా టూడే సైతం విచిత్రను వేధింపులకు గురి చేసిన హీరో బాలకృష్ణే అని చెప్పుకొచ్చింది. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.