iDreamPost
android-app
ios-app

Rakesh Master: రాకేశ్ మాస్టర్ గురించి చెబుతూ ఏడ్చేసిన శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్!

Rakesh Master: రాకేశ్ మాస్టర్ గురించి చెబుతూ ఏడ్చేసిన శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులకు తెలుస్తుంటారు. వారిలో చాలా కొద్ది మంది మాత్రమే అభిమానులను సొంతం చేసుకుంటారు. అలాంటి గొప్ప గొప్ప కళాకారుల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కూడా ఒకరు. ఇండస్ట్రీలో టాప్ హీరోలకు ఎన్నో మంచి నంబర్స్ ఇచ్చిన వ్యక్తి ఆయన. ప్రభాస్ లాంటి టాప్ హీరోలకు డాన్స్ నేర్పించాడు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ వంటి గొప్ప శిష్యులను పొందారు. ఆయన గురించి చెబుతూ శేఖర్ మాస్టర్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు.

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహః అంటారు. అంటే ఆ త్రిమూర్తలకంటే కూడా విద్యను నేర్పే గురువు గొప్పవాడు అని. అలాంటి ఒక గొప్ప గురువుని శేఖర్ మాస్టర్ పొందారు. ఆయన నేర్పిన విద్య వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. ఇటీవల రాకేశ్ మాస్టర్ కాలం చేసిన విషయం తెలిసిందే. అప్పుడు శేఖర్ మాస్టర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో గతంలో వారి మధ్య ఇలా జరిగింది అంటూ మరోసారి విబేధాలను బయట పెట్టారు.

గతంలో కూడా ఎంతో మంది వీరి మధ్య గొడవలు జరిగాయని, గురువుని ముంచిన శిష్యుడు అంటూ చాలానే మాట్లాడారు. ఆ అన్ని విషయాలపై శేఖర్ మాస్టర్ లైవ్ లో ఓపెన్ అయ్యాడు. ఢీ కార్యక్రమంలో జడ్జ్ గా పాల్గొన్న శేఖర్ మాస్టర్ లైవ్ లో ఏడ్చేశాడు. ఢీ ప్రోగ్రామ్ స్టేజ్ నుంచి వచ్చి రాకేశ్ మాస్టర్ మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ స్టేజ్ మీద ఆయన్ను మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.

మాది 8 సంవత్సరాల అనుబంధం అంటూ చెప్పుకొచ్చారు. చాలా మంది తెలిసీ తెలియకుండా ఏదేదో మాట్లాడితే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇటీవల సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో పెద్దకర్మ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రాకేశ్ మాస్టర్ కుటుంబం బాధ్యత తమది అని హామీ కూడా ఇచ్చారు. అలాగే ఆయన పేరిట ఏటా జాతీయ పురస్కారం అందజేస్తామని వెల్లడించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş