iDreamPost
android-app
ios-app

సూర్య నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు?

  • Published Mar 30, 2024 | 11:56 AM Updated Updated Mar 30, 2024 | 11:56 AM

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న 'కంగువ' సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుందనే టాక్ అయితే ఉంది. ఇక దర్శకుడు బాలాతో అనౌన్స్ చేసిన సినిమా చాలా భాగం షూట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయింది.

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న 'కంగువ' సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుందనే టాక్ అయితే ఉంది. ఇక దర్శకుడు బాలాతో అనౌన్స్ చేసిన సినిమా చాలా భాగం షూట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయింది.

  • Published Mar 30, 2024 | 11:56 AMUpdated Mar 30, 2024 | 11:56 AM
సూర్య నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు?

హీరో సూర్య నటించిన సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటింది. 2022 మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ‘ఈటీ’ ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం. అప్పటి నుండి, “విక్రమ్” లో రోలెక్స్ గా బాగా ఫేమస్ అయిన గెస్ట్ రోల్ మినహా, మరే సినిమా ఆయన నుంచి రాలేదు. నిజానికి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ప్రకటించినా ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుందనే టాక్ అయితే ఉంది. ఇక దర్శకుడు బాలాతో అనౌన్స్ చేసిన సినిమా చాలా భాగం షూట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయింది.

“వాడి వాసల్” అనే పెద్ద సినిమా కోసం స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో సినిమా అనౌన్స్ చేయగా ఆ సినిమా షూటింగ్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. పా రంజిత్ తో కలిసి సినిమా చేస్తారని వార్తలు వచ్చినా అవీ నిజం కాలేదు. దీనికి తోడు సుధా కొంగరతో చేస్తున్న “పురాణనూరు” సినిమా కథలో మార్పులు చేయాలనే ఉద్దేశ్యంతో ఆలస్యమవుతోంది. సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కనిపించనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఒక పక్క ఎదురు చూస్తుంటే షూటింగ్ ఇలా ఆలస్యం అవడం అభిమానులని కూడా నిరాశపరుస్తుంది. సూర్య – సుధ కొంగర కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన సూరరై పొట్రు (ఆకాశమే హద్దురా) సినిమాలో తన అత్యుత్తమ నటనకు సూర్య జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

When is Surya's next release

ఇదిలా ఉండగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో సూర్య 44వ సినిమా తెరకెక్కనుందని ఇటీవలే ప్రకటించారు. నిజానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంభినేషన్ అయినా సూర్య చేతిలో ఉన్న సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో క్లారిటీ అనేది లేకుండా పోయింది. ఎంతో టాలెంట్ తో పాటు స్టార్ ఇమేజ్ ఉన్న సూర్య సరైన విధంగా కెరీర్ ను మలచుకోవడం లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే సూర్య అభిమానులు మాత్రం కంగువ సినిమాతో తమ హీరో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet