iDreamPost
android-app
ios-app

movie: OTTలోకి కంగనా రనౌత్ ‘తేజస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Dec 27, 2023 | 1:41 PM Updated Updated Dec 27, 2023 | 1:41 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి అందరికి తెలిసిందే. నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె సినిమాల విషయంలో మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఇటీవలే ఆమె నటించిన తేజస్ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి సిద్దంగా ఉంది. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి అందరికి తెలిసిందే. నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె సినిమాల విషయంలో మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఇటీవలే ఆమె నటించిన తేజస్ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి సిద్దంగా ఉంది. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Published Dec 27, 2023 | 1:41 PMUpdated Dec 27, 2023 | 1:41 PM
movie: OTTలోకి కంగనా రనౌత్ ‘తేజస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఈమె గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి కంగనా. అంతేకాకుండా.. ఎన్నో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్  ఫైర్ బ్రాండ్ గా కూడా గుర్తింపు పొందింది. నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె ఏ విషయాన్ని అయిన సూటిగా, సుత్తి లేకుండా కుండబద్దలు కొడుతుంది. అయితే.. వివాదాలతో పాటు ఈ అమ్మాడు లవ్ ఎఫైర్స్ తో కూడా వార్తాల్లో బాగా వైరల్ అయ్యింది. కాగా, 2006లో బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది కంగనా. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే వరుస గ్లామర్ రోల్స్, ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో చేస్తూ.. స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఇది ఇలా ఉంటే.. ఇటీవలే కంగనా నటించిన ‘తేజస్’ సినిమా తాజాగా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

క్వీన్ కంగనా నటించిన ‘తేజస్’ సినిమా అక్టోబర్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 2016లో భారత వైమానిక దళంలోకి మొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా అందించబడిన ఈ సినిమాకి సర్వేష్ మేవారా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి అంతగా ప్రచారం కూడా జరగలేదు. దీంతో కంగనాకు నిరాశే మిగిల్చింది. కాగా, ఈ మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయబోతుంది. తాజాగా ఈ చిత్రనికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు. దీనిని ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన జీ5లో ఈ వచ్చే ఏడాది జనవరి 5న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.

tejas into ott

ఇక కంగనా ముక్కు సూటిగా మాట్లాడమే కాకుండా.. అనేకసార్లు ఇండస్ట్రీలో నెపోటిజం పై తీవ్రవ్యాఖ్యలు చేసింది. దీనితో ఆమెకు బాలీవుడ్ ఆవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇటీవలే రాఘవ లారెన్స్ నటించిన ‘చంద్రముఖి- 2’ లో ఈమె ప్రధాన పాత్రలో నటించింది. కానీ, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం కంగనా ‘ఎమర్జన్సీ’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మరి, త్వరలో ఓటీటిలో రాబోతున్న కంగనా తేజస్ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet