Swetha
ఇప్పటికే పవన్ అభిమానులు ఓజి మాయలో మునిగితేలుతున్నారు. రెండు వారాల క్రితం రిలీజ్ చేసిన ఓజాస్ గంభీర ఇంకా అభిమానుల మైండ్ లో రన్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా సినిమా నుంచి హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ సువ్వి సువ్వి సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఇప్పటికే పవన్ అభిమానులు ఓజి మాయలో మునిగితేలుతున్నారు. రెండు వారాల క్రితం రిలీజ్ చేసిన ఓజాస్ గంభీర ఇంకా అభిమానుల మైండ్ లో రన్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా సినిమా నుంచి హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ సువ్వి సువ్వి సాంగ్ ను రిలీజ్ చేసారు.
Swetha
ఇప్పటికే పవన్ అభిమానులు ఓజి మాయలో మునిగితేలుతున్నారు. రెండు వారాల క్రితం రిలీజ్ చేసిన ఓజాస్ గంభీర ఇంకా అభిమానుల మైండ్ లో రన్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా సినిమా నుంచి హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ సువ్వి సువ్వి సాంగ్ ను రిలీజ్ చేసారు. మెలోడీ లవర్స్ ఈ సాంగ్ ను లూప్ లో వింటున్నారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉంది. సో సహజంగానే అభిమానులు బర్త్ డే ట్రీట్ ఆసిస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో ట్రీట్ అంటే అది ఓజి టీజర్ అప్డేట్ గురించే అయ్యి ఉండాలి.
కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో సుజిత్ ఆ పనుల్లో చాలా బిజీ ఉన్నాడట. సో టీజర్ కట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని టాక్. ఒక వెర్షన్ ఫినిష్ అయింది కానీ దానిని ఇంకా పవన్ కు చూపించలేదట. పవన్ అటు కుటుంబ సభ్యుల సమావేశం , రాజకీయా సమావేశలలో బిజీగా ఉన్నాడు. సో ఒక్కరోజులో ఆ టీజర్ అప్రూవల్ అవ్వడం కుదరదు. కాబట్టి టీజర్ కాకుండా మరేదైనా పోస్టర్ ను రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఓజి కాకుండా ఫ్యాన్స్ లో ఇంకాస్త హైప్ పెంచేందుకు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ను ఇవ్వనున్నారు. అది కూడా బర్త్ డే కి ఓ రోజు ముందుగానే. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.
ఈ రెండు కాకుండా పవన్ నెక్స్ట్ చేయబోయే సినిమాల నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. రీరిలీజ్ లు ఎలాగూ ఉన్నాయి. అయితే వాటిలో జల్సా మూవీ రిరీలీజ్ మాత్రం అనుకోని కారణాల వలన క్యాన్సిల్ అయింది. కేవలం తమ్ముడు మాత్రమే పవన్ బర్త్ డే కి రీరిలీజ్ కాబోతుంది. ఇక బర్త్ డే కి ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.