చిరంజీవికి వచ్చిన గోల్డెన్‌ వీసా ప్రత్యేకతలు ఏంటి? ఇన్ని లాభాలు ఉంటాయా?

Dubai Golden Visa: ప్రపంచంలోని ప్రముఖులకు యూఏఈ ప్రభుత్వం ‘గోల్డెన్ వీసా’ అందిస్తు గౌరవిస్తుంది. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ‘గోల్డెన్ వీసా’ అందుకున్నారు. ఈ గోల్డెన్ వీసా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.

Dubai Golden Visa: ప్రపంచంలోని ప్రముఖులకు యూఏఈ ప్రభుత్వం ‘గోల్డెన్ వీసా’ అందిస్తు గౌరవిస్తుంది. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ‘గోల్డెన్ వీసా’ అందుకున్నారు. ఈ గోల్డెన్ వీసా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకగా భావించే గోల్డెన్ వీసా ఆయనకు లభించింది. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గౌరవంతో మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. 2019 లో యూఏఈ ప్రభుత్వ ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ గోల్డెన్ వీసా తో ఎన్నో లాభాలు ఉన్నాయి. యూఏఈ లో దీర్గకాలిక రెసిడెన్సీ ఏర్పాటు చేసుకునే సౌకర్యంతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాంది మెగాస్టార్ చిరంజీవికి ‘గోల్డెన్ వీసా’ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అసలు ఈ గోల్డెన్ వీసా ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.. వివరాల్లోకివెళితే..

ఇప్పటి వరకు యూఏఈ ప్రభుత్వం భారతీయ ప్రముఖులకు గోల్డెన్ వీసాలను అందించి గౌరవించింది. బాలీవుడ్ లో షారూక్ ఖాన్ తొలిసారి ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఆ తర్వాత రజినీకాంత్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, ఫరా ఖాన్, బోనీ కపూర్, మౌనీ రాయ్ సింగర్ సోనూ నిగమ్ పొందారు. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న తొలి భారతీయ హీరోయిన్ త్రిష గుర్తింపు తెచ్చుకుంది. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కన్ సల్మాన్ ఈ గౌరవాన్ని పొందారు. ఇక టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ సతీమణి ఉపాసన తొలిసారిగా ఈ గోల్డెన్ వీసా అందుకుంది.. తర్వాత అల్లు అర్జున్ అందుకున్నారు. తాజాగా మోగాస్టార్ చిరంజీవి కి ఈ అరుదైన గౌరవం దక్కడం ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటీ? దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రపంచంలో పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిది దుబాయ్. హ్యాపీ వెకేషన్ కోసం ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి తరలి వస్తున్నాు.  ఇక్కడకి ధనవంతులు నివాసం, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి కోసమే దుబాయ్ గవర్నమెంట్ ఓ అవకాశాన్ని తీసుకు వచ్చింది. దుబాయ్ లో సొంత నివాసం, వ్యాపారాభివృద్ది చేసుకోవడానికి యూఏఈ తీసుకు వచ్చిన విధానమే గోల్డెన్ వీసా.. ఈ విధానాన్ని 2019 నుంచి అమలు చేస్తుంది. ఇప్పటి వరకు ఈ వీసా అందుకున్నవారిలో భారత దేశానికి చెందని సినీ, క్రీడా రంగానికి చెందిన వారు ఉండటం విశేషం.

  • తమ సొంత దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న గోల్డెన్ వీసాదారులకు యూఏఈలో నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
  • దుబాయ్ లోని డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ లో దరఖాస్తు చేసుకొని రెండు పరీక్షల్లో పాస్ అయితే చాలు లైసెన్స్ వచ్చేస్తుంది.
  • దుబాయ్ లో వీసా పొందాలంటే స్పాన్సర్ లేదా యజమాని అవసరం ఉండేది.. కానీ గోల్డెన్ వీసా ఉంటే అవన్నీ అవసరం లేదు.
  • ఒకవేళ గోల్డెన్ వీసా కలిగిన వారు ప్రాథమిక హూల్డర్ మరణిస్తే కుటుంబ సభ్యులకు అనుమతి చెల్లబాటుకు హామీ ఇస్తుంది.
  • గోల్డెన్ వీసా ఉన్నవారు వారి కుటుంబ సభ్యులను సైతం స్పాన్సర్ చేసుకునే అవికాశం ఉంటుంది.
  • గోల్డెన్ వీసా ఉన్నవారికి దుబాయ్ లో ఉండే ప్రతి బీమా పాలసీ అమలు అవుతాయి.
  • గోల్డెన్ వీసా ఉన్నవారు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దుబాయ్ బయట నివాసం ఉన్నప్పటికీ వీసా రద్దు కాదు.
  • 10 ఏళ్ల కాల పరిమితితో ఉండే ఈ వీసా ఆ తర్వాత ఆటోమెటిక్ గా రిన్యూవల్ అవుతుంది.
  • గోల్డెన్ వీసాతో యూఏఈ లో నివాసాలు మాత్రమే కాదు.. వ్యాపారాలు కూడా నిర్వహించుకోవొచ్చు.
Show comments