ఇప్పుడు నడిచేది టెక్ యుగం. సాంకేతికత రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ మనిషి జీవనాన్ని మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటి ఉద్యోగాలన్నీ దాదాపుగా అన్నీ కూర్చొని చేసే జాబ్సే కావడం గమనార్హం. డెస్క్ ఉద్యోగాలు ఎక్కువైపోయాయి. అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ల వినియోగం పెరిగింది. సాంకేతిక విప్లవం కారణంగా మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. జేబులో ఒక ఫోన్ ఉంటే చాలు.. అన్నీ ఉన్నట్లే. ప్రతిదీ ఫోన్ నుంచే ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. టెక్నాలజీ ఇంతగా మనుషుల జీవనంలో భాగం అయిపోయింది. అయినా సైంటిస్టులు సాంకేతిక రంగానికి సంబంధించి ఏదో ఒకటి కొత్తది కనిపెడుతూనే ఉన్నారు.
ఈమధ్య ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చాట్ జీపీటీతో పాటు మరికొన్ని ఏఐ టూల్స్ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఒక కోలీవుడ్ సినిమాలో కృత్రిమ మేధ సాయంతో ఒక పాత్రను యుక్త వయసులో ఉన్నట్లు చూపించనున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో కట్టప్పగా అందరికీ చేరువయ్యారు సీనియర్ నటుడు సత్యరాజ్. ఆయన మెయిర్ రోల్లో ‘వెపన్’ అనే ఓ తమిళ సినిమా తెరకెక్కుతోంది. అయితే సత్యరాజ్‌కు ప్రస్తుతం 68 ఏళ్లు. కానీ ఈ మూవీలో ఏఐను ఉపయోగించి ఆయన 28 ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూపించనున్నారు. ఈ మూవీలో మొత్తం 1,200 సీజీఐ షాట్లు ఉంటాయట.
సాధారణంగా సినిమాల్లో నటీనటులను యంగ్‌గా చూపించేందుకు పలు టెక్నాలజీలను వాడేవారు. కానీ ‘వెపన్’ డైరెక్టర్ గుహన్ సెన్నియప్పన్ తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించారు. దీంతో ఈ ఫిల్మ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పటిదాకా హాలీవుడ్ మూవీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి వాటిల్లో మాత్రమే ఏఐను వినియోగించారు. ఫస్ట్ టైమ్ ఇండియన్ మూవీస్‌లో ఈ టెక్నాలజీని వాడుతుండటం విశేషం. తాజాగా ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వెపన్’ దర్శకుడు ఈ విషయాన్ని తెలిపారు. మూవీలో ఈ క్యారెక్టర్ కోసం ఐదుగురు సభ్యులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
#Weapon – Tamil cinema gets its first film about a superhuman, played by veteran #Sathyaraj. Set in a fictional town, the film has about 1200 CGI shots.
Also stars @iamvasanthravi in a key role.
A film by @GuhanSenniappan pic.twitter.com/ca4UraHZVk
— Haricharan Pudipeddi (@pudiharicharan) July 31, 2023
#WEAPON : AI DeAging Technique ⭐
• Weapon Team Has Used AI To Generate De-Aging Clip Of #Sathyaraj 🔥
• In Animation It Will Take in Months But AI Finished in 15 Days🤯
• It’s A First Ever Indian Film To Use AI For De-Aging Technique👏🏾#VasanthRavi | #GuhanSenniappan pic.twitter.com/EZ8eknRgfn— Cinepuram (@cinepuram) July 30, 2023