iDreamPost
android-app
ios-app

Tollywood: చరణ్, తారక్ మధ్య మళ్ళీ రచ్చ? అసలు ఏమైందంటే?

  • Published Oct 02, 2024 | 1:00 PM Updated Updated Oct 03, 2024 | 10:53 AM

Tollywood: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉన్నారు. పాన్ ఇండియా హీరోలుగా సూపర్ స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్నారు.

Tollywood: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉన్నారు. పాన్ ఇండియా హీరోలుగా సూపర్ స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్నారు.

Tollywood: చరణ్, తారక్ మధ్య మళ్ళీ రచ్చ? అసలు ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోలుగా సూపర్ స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. తమ సక్సెస్ లతో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకుపోతున్నారు. రామ్ చరణ్ కి రీసెంట్ గా అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. ఆయనతో పాటు ఆయన పెట్ డాగ్ రైమీ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో పెట్టనున్నారు. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి.

ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే దేవరతో వచ్చి దుమ్ము లేపుతున్నాడు. సోలోగా వచ్చి బాక్స్ ఆఫీసుని బద్ధలు కొడుతున్నాడు. దేవర సినిమా సృష్టిస్తున్న వసూళ్ల సునామీ అంతా ఇంత కాదు. మూడు రోజుల్లోనే మూడు వందల కోట్లు కొల్లగొట్టింది. ఇంకా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికీ కూడా సినిమా థియేటర్లన్ని హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. ఆడియన్స్ లో దేవర వైబ్స్ అస్సలు పోవట్లేదు. సినిమా చూసిన వారంతా ఇది పక్కా మాస్ బొమ్మ అంటున్నారు. దేవర ఇంతటి ఘన విజయం సాధించినందుకు అభిమానూలు కాలర్ ఎగరేస్తున్నారు. దేవర సక్సెస్ ని ఒక రేంజిలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా అటు రామ్ చరణ్ అభిమానులు, తారక్ అభిమానులు తమ హీరోల విజయాల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇదంతా బాగుంది కానీ .. కొంతమంది అభిమానులు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

NTR vs Charan

వీళ్లదరి మధ్య కంపేరిజన్స్ స్టార్ట్ చేశారు. ట్రోల్స్ మొదలు పెట్టారు. అటు రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్‌ గుర్తింపు పొందగా, తారక్ ఆ గుర్తింపుని పొందలేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. తారక్ ని తక్కువ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అటు తారక్ ఫ్యాన్స్ కూడా తగ్గట్లేదు. దేవర వసూళ్లని చరణ్ కొట్టే సీన్ లేదంటున్నారు. చరణ్ సోలోగా చేసిన కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లైఫ్ టైమ్ వసూళ్లని తారక్ దేవరతో కేవలం రెండు రోజుల్లోనే దాటేశాడని తారక్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఒకరినొకరు చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. నిజానికి తారక్, చరణ్ ప్రాణ స్నేహితులు. వారి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం రికార్డుల కోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఇలా గొడవలు పడి వారికి చెడ్డ పేరు తెస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ ఎప్పుడు ఆగుతాయో? అభిమానులు ఎప్పుడు మారతారో? చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetMadridbet