iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‏: RGV ఆఫీస్ వద్ద ఆందోళన.. వీడియో పోస్ట్ చేసిన వర్మ

  • Published Dec 26, 2023 | 9:33 AM Updated Updated Dec 26, 2023 | 9:33 AM

సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్ద కొందరు ఆందోళనకు దిగారు. అక్కడ బీభత్సం స్రుష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఆర్జీవీ. ఆ వివరాలు..

సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్ద కొందరు ఆందోళనకు దిగారు. అక్కడ బీభత్సం స్రుష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఆర్జీవీ. ఆ వివరాలు..

  • Published Dec 26, 2023 | 9:33 AMUpdated Dec 26, 2023 | 9:33 AM
హైదరాబాద్‏: RGV ఆఫీస్ వద్ద ఆందోళన.. వీడియో పోస్ట్ చేసిన వర్మ

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం సినిమా విడుదల పనులతో బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించారు. మంత్రి రోజాతో పాటు అనేక మంది ప్రముఖులు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై తెరకెక్కిన వ్యూహం సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. థియేటర్లతోపాటు, ఓటీటీల్లోనూ సినిమా రిలీజ్ చేయొద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యూహం విడుదల తేదీని మార్చారు వర్మ. దాంతో డిసెంబర్ 27న కాకుండా.. 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు వర్మ. ఇదిలా ఉండగా.. తాజాగా ఆర్జీవీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యకర్తలు. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఆర్జీవీ. ఆ వివరాలు..

హైదరాబాద్ ఫిలింనగర్‏లో ఉన్న ఆర్జీవీ ఆఫీస్ బయట.. టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ. దీనిలో ఆందోళనకారులు.. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని కేకలు వేస్తూ ఆ సినిమా పోస్టర్లను తగలబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు ఆర్జీవీ. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ.. ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ‘హేయ్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్.. నా ఆఫీసు బయట మీ కుక్కలు మొరుగుతున్నాయి. పోలీసులు రాగానే వాళ్లు పారిపోయారు’ అంటూ సెటైర్లు వేశాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఘటనపై వ్యూహం సినిమా ప్రొడ్యూసర్.. దాసరి కిరణ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడాలన్నారు. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు ఇలా దాడులు చేయడం సరికాదని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిస్థితులపై వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş