iDreamPost
android-app
ios-app

కల్కీ టీమ్ బంపరాఫర్.. రూ. 100కే టికెట్‌.. అప్పటి వరకే ఛాన్స్!

  • Published Aug 01, 2024 | 10:23 PM Updated Updated Aug 01, 2024 | 10:23 PM

Kalki 2898 AD: మూవీ లవర్స్ కు కల్కి టీమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. వైజయంతీ మూవీస్ రూ. 100కే కల్కి మూవీ చూడొచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉండనుందంటే?

Kalki 2898 AD: మూవీ లవర్స్ కు కల్కి టీమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. వైజయంతీ మూవీస్ రూ. 100కే కల్కి మూవీ చూడొచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉండనుందంటే?

  • Published Aug 01, 2024 | 10:23 PMUpdated Aug 01, 2024 | 10:23 PM
కల్కీ టీమ్ బంపరాఫర్.. రూ. 100కే టికెట్‌.. అప్పటి వరకే ఛాన్స్!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది ఈ సినిమా. ఇప్పటి వరకు కల్కి మూవీ దాదాపు 11 వందల కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో కల్కి టీమ్ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అందించింది. కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సినీ ప్రియుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. రూ. 100కే కల్కి టికెట్ ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉండనుందంటే?

గతేడాది రిలీజ్ అయిన సలార్ మూవీతో సాలిడ్ హిట్ అందుకుని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు డార్లింగ్ ప్రభాస్. ఇక అదే జోష్ తో ఇప్పుడు కల్కి మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. కాగా కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ సినీ ప్రియులకు శుభవార్త వినిపించింది. రూ. 100కే కల్కి మూవీ చూడొచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఈ నెల 2 వారం రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది.

అయితే ఈ అవకాశం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే వర్తించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మల్టీ స్క్రీన్ లలో కల్కి మూవీ టికెట్ ధర రూ. 150గా ఉంది. కాగా వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş