iDreamPost
android-app
ios-app

Vishwak Sen: విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్! అతడికి పోటీ లేనట్లేనా? 

  • Published Jul 21, 2024 | 1:51 PM Updated Updated Jul 21, 2024 | 1:51 PM

ఈసారి దీపావళికి 'మెకానిక్ రాకీ' గా బ్లాస్టింగ్ చేయడానికి వస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. దాంతో ఇది డేరింగ్ స్టెప్పే అంటున్నారు కొందరు సినీ పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..

ఈసారి దీపావళికి 'మెకానిక్ రాకీ' గా బ్లాస్టింగ్ చేయడానికి వస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. దాంతో ఇది డేరింగ్ స్టెప్పే అంటున్నారు కొందరు సినీ పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 21, 2024 | 1:51 PMUpdated Jul 21, 2024 | 1:51 PM
Vishwak Sen: విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్! అతడికి పోటీ లేనట్లేనా? 

టాలీవుడ్ నిర్మాత గురి ఎక్కువగా పండగల మీదే ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని పండగ బరిలో నిలవాలని చూస్తుంటారు. అయితే ఎక్కువగా సంక్రాంతి బరిలో దూకడానికి ఇటు హీరోలు, అటు నిర్మాతలు ఇష్టపడుతుంటారు. కానీ.. చాలా మంది మేకర్స్ దీపావళి పండక్కి రావడానికి ఎక్కువ మెుగ్గుచూపరు. ఈ ఫెస్టివల్ కు ఎక్కువగా డబ్బింగ్ సినిమా జోరే కనిపిస్తుంది. అయితే ఈసారి దీపావళికి ‘మెకానిక్ రాకీ’ గా బ్లాస్టింగ్ చేయడానికి వస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. దాంతో ఇది డేరింగ్ స్టెప్పే అంటున్నారు కొందరు సినీ పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ నిర్మాతలకు దీపావళి పండగపై గురి ఉండదు. దాంతో తెలుగు సినిమాలు రిలీజ్ కావు. ఇక ఈ పండక్కి డబ్బింగ్ సినిమాల జోరు మామూలుగా ఉండదు. ఈ ఏడాది కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే దీపావళి కానుకగా అక్టోబర్ 31న బాక్సాఫీస్ దండయాత్రకు వస్తున్నాయి. అందులో ఒకటి టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపుడి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఇదొక్కటే దీపావళి కానుకగా వస్తోంది. మరే టాలీవుడ్ మూవీ కనిపించడం లేదు. అయితే తమిళ్ నుంచి శివకార్తికేయన్ ‘అమరన్’ మూవీ ఇదే డేట్ కు రానుంది. కమల్ హాసన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కాగా.. ఈ ఫెస్టివల్ కు తెలుగు హీరోలు అంత ఆసక్తి చూపెట్టనప్పటికీ.. విశ్వక్ సేన్ మాత్రం డేరింగ్ స్టెప్ వేసి బరిలోకి దిగుతున్నాడు. దీపావళి రిలీజ్ సెంటిమెంట్ కానప్పటికీ.. విశ్వక్ తన మూవీని రిలీజ్ చేస్తున్నాడు. అక్టోబర్ 31 లాంగ్ వీకెండ్ కావడంతో.. మూవీ టీమ్ ఈ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. సెంటిమెంట్స్ ను పక్కనపెడితే.. సోలో రిలీజ్ అంటే సినిమాకు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకైతే విశ్వక్ కు పోటీ లేదు. మరి రాబోయే రోజుల్లో ఏ హీరో అయినా.. దీపావళి బరిలోకి దిగుతాడో లేదో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş