ఈ ఏడాది ఎండింగ్ లో బిగ్గెస్ట్ మూవీస్ తో పాటు మీడియం సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సాహసం చేసేందుకు రెడీ అవుతున్నాయట. క్రిస్మస్ సందర్బంగా ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్, కింగ్ షారుఖ్ ఖాన్ డుంకి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. ఆ టైమ్ లో ఈ రెండు సినిమాలకే థియేటర్స్ వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించుకునే విధంగా లేదు. అలాంటిది టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని కూడా రేసులో దింపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 24కి సినిమా షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్.
క్రిస్మస్ టైమ్ లో థియేటర్స్ అన్ని దాదాపు సలార్ కే కేటాయించే అవకాశం ఉంది. సౌత్ లో సలార్ కి, నార్త్ లో డుంకి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ.. మధ్యలో ఏ సినిమా వచ్చినా.. థియేటర్స్ దొరికే అవకాశం తక్కువ. రెండు రోజుల ముందే సలార్, డుంకి లాంటి పాన్ ఇండియా రిలీజ్ లు పెట్టుకొని.. రిలీజ్ పెట్టుకోవడం అంటే సాహసం అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రభాస్ సినిమాకు యావరేజ్, ప్లాప్ టాక్ వస్తేనే.. దాదాపు వారం రోజుల పాటు థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. అలాంటిది కేజీఎఫ్ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అంటే.. ఆ వారం థియేటర్స్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒకవేళ సలార్ కి పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ పరిస్థితి పైసా వసూల్ అయిపోతుంది. ఆల్రెడీ సలార్ వస్తుందని.. క్రిస్మస్ కి రిలీజ్ అనుకున్న హాయ్ నాన్న, సైందవ్ లాంటి సినిమాలు తప్పుకున్నాయి. ఈ లెక్కన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. మరోవైపు డుంకి వాయిదా లేదని బాలీవుడ్ మీడియా క్లారిటీ ఇచ్చేసింది. సో.. డుంకి రాకపోతే.. విశ్వక్ సేన్ సినిమా దింపుదామని ప్రొడ్యూసర్అ ప్లాన్ చేశారేమో. ఎందుకంటే.. సలార్ చూసిన వారు తమ సినిమా చూసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ డిసెంబర్ 8న రిలీజ్ అని ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు జరుగుతున్న చర్చల ప్రకారం.. డేట్ మారుతుందో లేదో తెలియదు. సో.. సలార్ తో మాస్ కా దాస్ పోటీ అంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.