iDreamPost
android-app
ios-app

Vishwak Sen: మాటనిలబెట్టుకున్న విశ్వక్! నితిన్ కథతో..

  • Published Jul 15, 2024 | 4:08 PM Updated Updated Jul 15, 2024 | 4:08 PM

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. మరి ఆ మాటేంటి? మధ్యలో నితిన్ కథ ఎందుకు వచ్చింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. మరి ఆ మాటేంటి? మధ్యలో నితిన్ కథ ఎందుకు వచ్చింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Vishwak Sen: మాటనిలబెట్టుకున్న విశ్వక్! నితిన్ కథతో..

ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన వారికే గుర్తింపైనా, గౌరవం అయినా. అది హీరో కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి అవకాశాలు ఇవ్వాలన్ని ఏ హీరో, నిర్మాత అనుకోడు. ఆ విషయం మనకు తెలినిది కాదు. అయితే తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చే హీరోలు బహు అరుదుగా దొరుకుతారు. అలాంటి అరుదైన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. ఇచ్చిన మాట కోసం తనకు ఓ మోస్తారు విజయం ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? మధ్యలో హీరో నితిన్ కథ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశ్రమలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే హీరోలు తక్కువనే చెప్పాలి. పైగా తమకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వాలంటే ఎన్నో గట్స్ కూడా ఉండాలి. ఆ గుండె ధైర్యంతో ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా చేసే టైమ్ లోనే డైరెక్టర్ కృష్ణ చైతన్యకు ఓ మాటిచ్చాడట విశ్వక్ సేన్. ఈ మూవీ ఫలితం ఎలా ఉన్నా.. ఇంకో సినిమా నీతో చేస్తానని మాటిచ్చాడట. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వక్ సేన్-కృష్ణ చైతన్య కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. గతంలో నితిన్ కోసం చైతన్య ‘పవర్ పేట’ టైటిల్ తో ఓ కథను రాసుకొన్నాడు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ తోనే విశ్వక్ తో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కథకు విశ్వక్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చైతన్య తెలిపాడు. కాగా.. ప్రస్తుతం మాస్ కా దాస్ ‘లైలా’ అనే క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందా? లేక రెండు సినిమాలను సమాంతరంగా తెరకెక్కిస్తాడా? అన్నది చూడాలి. ఇక ఇచ్చిన మాటకోసం నిరాశ పరిచిన డైరెక్టర్ కు విశ్వక్ ఛాన్స్ ఇచ్చి.. గొప్ప మనసు చాటుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş