iDreamPost
android-app
ios-app

హీరోలపై విశ్వక్ సేన్ కామెంట్స్.. తగ్గితే తొక్కేస్తారు అంటూ..

  • Author Soma Sekhar Published - 11:28 AM, Sun - 29 October 23

ఏ విషయాన్ని అయినా.. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం విశ్వక్ కు అలవాటు. తాజాగా అతడు చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి విశ్వక్ ఆ ట్వీట్ ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ విషయాన్ని అయినా.. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం విశ్వక్ కు అలవాటు. తాజాగా అతడు చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి విశ్వక్ ఆ ట్వీట్ ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 11:28 AM, Sun - 29 October 23
హీరోలపై విశ్వక్ సేన్ కామెంట్స్.. తగ్గితే తొక్కేస్తారు అంటూ..

విశ్వక్ సేన్.. తన సినిమా రిలీజ్ విషయంలో, ప్రమోషన్ల విషయంలో ఎంత దూకుడుగా ఉంటాడో మనందరికి తెలిసిందే. ఇక తన యాటిట్యూడ్ తో ఇండస్ట్రీలో మాస్ కా దాస్ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్నాడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. హీరోగా ఓ స్థాయిలో నిలబడ్డాడు. అయితే తరచుగా వివాదాలు ఆయన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇటీవల బేబీ మూవీ విషయంలో వివాదం రాజుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏ విషయాన్ని అయినా.. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం విశ్వక్ కు అలవాటు. తాజాగా అతడు చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో తగ్గే కొద్ది ప్రతి నా కొడుకు మింగాలనే చూస్తాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

విశ్వక్ సేన్, నేహాశెట్టి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. డిసెంబర్ 8న మూవీని విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్, గ్లింప్స్, నేహాశెట్టి అందాలు, పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే డిసెంబర్ 7, 8 తేదీల్లో చాలా సినిమాలు రాబోతున్నాయి. నితిన్ హీరోగా ఎక్స్ ట్రార్డినరీ, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. దీంతో రిలీజ్ డేట్ విషయంలో తేడా కొడుతుండటంతో.. విశ్వక్ సేన్ అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తాజాగా సంచలన ట్వీట్ చేశాడు విశ్వక్. ట్వీట్టర్ వేదికగా ఈ విధంగా రాసుకొచ్చాడు మాస్ కా దాస్..

“ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దామని, మింగేద్దామని అనుకుంటాడు. ఈ సినిమాకు నేను ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి చేశా.. నేను సినిమా చూడకుండా చెబుతున్నా.. డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారో అన్నది మీ ఇష్టం. అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నా. ఇది ఈగోకి లేదా ఆవేశానికి పోయి తీసుకున్న నిర్ణయం కాదు. తగ్గే కొద్ది మింగుతారని అర్ధమైంది. గంగమ్మ తల్లికి నా ఒట్టు.. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్ లో సినిమా రాకపోతే.. నేను ప్రమోషన్స్ లో కనిపించను” అంటూ విశ్వక్ తన బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచాడు. కాగా.. విశ్వక్ సేన్ పోస్ట్ చూస్తుంటే.. చాలా అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో సినిమా అనుకున్న టైమ్ కు రిలీజ్ కాకపోతే.. తాను ప్రమోషన్స్ కు రానని డైరెక్ట్ గానే మేకర్స్ కు వార్నింగ్ ఇచ్చాడు మాస్ కా దాస్. అయితే స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ వెనక్కి తగ్గుతారా? లేదా విశ్వక్ ను శాంతింప జేస్తారా? అన్నది వేచిచూడాలి. మరి విశ్వక్ సేన్ ఇండస్ట్రీలోని హీరోలపై పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş