iDreamPost
android-app
ios-app

వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. విశ్వక్ సేన్ షాకింగ్ పోస్ట్!

  • Published Mar 12, 2024 | 3:15 PM Updated Updated Mar 12, 2024 | 3:15 PM

గామి మూవీపై నెగిటివ్ రేటింగ్ ఇస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు హీరో విశ్వక్ సేన్. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని షాకింగ్ పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గామి మూవీపై నెగిటివ్ రేటింగ్ ఇస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు హీరో విశ్వక్ సేన్. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని షాకింగ్ పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Mar 12, 2024 | 3:15 PMUpdated Mar 12, 2024 | 3:15 PM
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. విశ్వక్ సేన్ షాకింగ్ పోస్ట్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా ప్రయోగాత్మకమైన మూవీ ‘గామి’తో సూపర్ హిట్ కొట్టాడు. విడుదలైన నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 22 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. లాభాల్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ మూవీపై కావాలనే నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నారని హీరో విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మూవీ చాలా బాగుందని అందరూ అంటుంటే.. కొందరు మాత్రం పనిగట్టుకుని తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారని, అలాంటి వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని షాకింగ్ పోస్ట్ చేశాడు విశ్వక్.

గామి మూవీతో హిట్ కొట్టాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే బుక్ మై షో వెబ్ సైట్ లో రేటింగ్ విషయంలో చిన్న వివాదమే నడుస్తోంది. తాజాగా ఈ ఇష్యూపై స్పందించాడు విశ్వక్. సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. అందులో ఏం రాసుకొచ్చాడంటే?

“నా గామి మూవీని హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. అయితే రేటింగ్స్ విషయంలో నేను గట్టిగానే మాట్లాడాలనుకుంటున్నాను. కొందరు కావాలనే 10కి 1 రేటింగ్ ఇస్తున్నారు. ఫేక్ యాప్స్ ఉపయోగించి ఇలా రేటింగ్ ఇవ్వడం కారణంగా 9 ఉన్న రేటింగ్ కాస్త 1కి పడిపోతోంది. ఇలాంటి వారికి ఒక్కటే చెప్పదలచుకున్నా.. మీరు నన్ను ఎంత కిందికి లాగితే.. నేను అంతపైకి లేస్తా. ఈ పని ఎవరు చేస్తున్నారో తెలీదు కానీ.. వారిని కనిపెట్టి, లీగల్ యాక్షన్ తీసుకుంటా” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు. కాగా విశ్వక్ గత కొన్ని సినిమాల నుంచి ఇలాంటి ప్రాబ్లమ్ నే ఫేస్ చేస్తున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఇదికూడా చదవండి: OTT Movie: OTTలో స్ట్రీమింగ్ అవుతున్న త‌మిళ్ కామెడీ మూవీ! ఆపుకున్నా నవ్వు ఆగదు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş