iDreamPost

OTT Movie: OTTలో స్ట్రీమింగ్ అవుతున్న త‌మిళ్ కామెడీ మూవీ! ఆపుకున్నా నవ్వు ఆగదు!

  • Published Mar 12, 2024 | 12:54 PMUpdated Mar 14, 2024 | 3:56 PM

ఓటీటీలో వరుస సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఫస్ట్ తమిళ సినిమా.. వడక్కుపట్టి రామ సామీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

ఓటీటీలో వరుస సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఫస్ట్ తమిళ సినిమా.. వడక్కుపట్టి రామ సామీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

  • Published Mar 12, 2024 | 12:54 PMUpdated Mar 14, 2024 | 3:56 PM
OTT Movie: OTTలో స్ట్రీమింగ్ అవుతున్న  త‌మిళ్ కామెడీ మూవీ! ఆపుకున్నా నవ్వు ఆగదు!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను నిర్మించింది. ఈ క్రమంలో ఇప్పుడు మొట్ట మొదటి సారిగా.. ఓ తమిళ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థ. సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం వడక్కుపట్టి రామ సామి. పిరియాడికల్ కామెడీ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో వరుసగా సినిమాలు సందడి చేస్తున్న క్రమంలో.. ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది. మరి, ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

వడక్కుపట్టి రామ సామి చిత్రానికి కార్తీక్ యోగి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది. ఈ సినిమాతో మొదటి సారిగా పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో అగ్రహీరోల సినిమాలను నిర్మిస్తున్న ఈ ప్రముఖ సంస్థ.. కోలీవుడ్ లో సంతానం సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ దాదాపు 12 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిందట. ఇక థియేటర్ లో ఈ సినిమా కేవ‌లం ఐదున్న‌ర కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఇప్పుడు వడక్కుపట్టి రామ సామి సినిమా ఓటీటీలో ఎంట్రీకి రెడీ అయింది. మార్చి 12నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1960, 70 కాలంలో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. ఒక ఊరిలో ఉన్న గుడి, ఆ గుడిలో ఉన్న దేవుడి పేరు చెప్పుకుని.. రామసామీ అనే వ్యక్తి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇక అతడిపై ఉన్న కోపంతో కొందరు శత్రువులు గుడిని మూసేస్తారు. ఈ క్రమంలో రామసామితో ఓ డాక్టరుతో ప్రేమలో పడతాడు.. మరి ఆ అమ్మాయి మనసును ఎలా గెలిపించుకున్నాడు ! ఇక ఆ గుడిని తెరవడానికి రామసామి ఎటువంటి ప్రయత్నాలు చేశాడు అన్నదే ఈ సినిమా కథ. రొటీన్ స్టోరీగా ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా.. సంతానం కామెడీ బాగుందనే టాక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో ఈ సినిమా ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, “వడక్కుపట్టి రామసామీ” సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి