iDreamPost
android-app
ios-app

Gaami Teaser: గామి టీజర్‌.. విశ్వక్‌ ప్రయాణం దేని కోసం

  • Published Feb 17, 2024 | 11:56 AM Updated Updated Feb 17, 2024 | 12:06 PM

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ అఘోరా పాత్రలో నటిస్తోన్న గామి చిత్రం టీజర్‌ నేడు విడుదలయ్యింది. ఆ హైలెట్స్‌ మీ కోసం

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ అఘోరా పాత్రలో నటిస్తోన్న గామి చిత్రం టీజర్‌ నేడు విడుదలయ్యింది. ఆ హైలెట్స్‌ మీ కోసం

  • Published Feb 17, 2024 | 11:56 AMUpdated Feb 17, 2024 | 12:06 PM
Gaami Teaser: గామి టీజర్‌.. విశ్వక్‌ ప్రయాణం దేని కోసం

యువహీరో విశ్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గామి. చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే టైటిల్‌, మేకింగ్‌ వీడియోతో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు మేకర్స్‌. విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీని వీ సెల్యూలాయిడ్‌ బ్యానర్‌పై.. కార్తీక్‌ శబరీష్‌ నిర్మిస్తున్నారు. ఇక నేడు అనగా ఫిబ్రవరి 17, ఉదయం 11 గంటలకు సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇది సినిమాపై అంచనాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. టీజర్‌ హైలెట్స్‌ మీకోసం

సినిమాలో నటిస్తోన్న​ ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌ని రివీల్‌ చేస్తూ సాగింది గామి టీజర్‌. ఇదే నీ సమస్యకు పరిష్కారం అంటూ ఓ మ్యాప్‌ని చూపిస్తూ టీజర్‌ ప్రారంభమవుతుంది. చివర్లో అఘోరగా విశ్వక్‌ను పరిచయం చేస్తుంది. అంటే అఘోరా పాత్రలో నటిస్తోన్న విశ్వక్‌ సేన్‌ తన సమస్యకు పరిష్కారం వెతుకుతూ హిమాలయాలకు చేసే ప్రయాణమే ఈ గామి అని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. మరి ఇంతకు విశ్వక్‌ సేన్‌ ఎదుర్కొన్న సమస్య ఏంటి.. పరిష్కారం కోసం ఎక్కడి వరకు పయనించాడు.. చివరకు తన సమస్య తీరిందా లేదా అంటే.. సినిమా చూడాల్సిందే.

క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం.. అలాంటి సమస్యనే ఎదర్కొంటున్న అఘోర శంకర్‌.. తన సమస్య పరిష్కారం కోసం హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రం అని చెప్పుకొచ్చారు. తాజాగా టీజర్‌లో కూడా అదే చూపించారు. ఇక ఈ సినిమాలో అధిక భాగం.. కాశీ, హిమాలయాల్లోనే షూట్ చేసినట్టు సమాచారం. గామి ట్రైలర్‌ని ఫిబ్రవరి 29న రిలీజ్ చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 8 న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీలో ఎం జి అభినయ, మొహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పేడాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గామి టీజర్‌ చూసిన ప్రేక్షకులు విజువల్స్‌ అద్భుతంగా ఉండి సినిమాపై అంచనాలను మరింత పెంచింది.. బీజీఎం వింటుంటూ గూస్‌బంప్స్‌ వస్తున్నాయి అంటున్నారు. విశ్వక్‌ ఖాతాలో మరో హిట్టు పక్కా అని కామెంట్స్‌ చేస్తున్నారు. మీరు గామి టీజర్‌ చూశారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio