iDreamPost
android-app
ios-app

గామి నుండి ఇంట్రెస్టింగ్ వీడియో.. అప్డేట్ అదిరింది!

  • Published Feb 07, 2024 | 5:50 PM Updated Updated Feb 07, 2024 | 5:50 PM

Update From Gaami Movie: విశ్వక్ సేన్ గామి అనే ఒక క్రేజీ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ టీమ్ ఇప్పుడు ప్రేక్షకులకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది.

Update From Gaami Movie: విశ్వక్ సేన్ గామి అనే ఒక క్రేజీ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ టీమ్ ఇప్పుడు ప్రేక్షకులకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది.

  • Published Feb 07, 2024 | 5:50 PMUpdated Feb 07, 2024 | 5:50 PM
గామి నుండి ఇంట్రెస్టింగ్ వీడియో.. అప్డేట్ అదిరింది!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి మూవీ వస్తోంది అంటే ఆడియన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. ఎందుకంటే ఈ యంగ్ హీరోనే కాదు.. అతని సినిమాలు కూడా అంతే ఎనర్జిటిక్ గా ఉంటాయి. విశ్వక్ ఎంచుకునే కథలు ఎంతో కొత్తగా ఉంటాయి. ఫ్యాన్ పల్స్ పట్టుకోవడంలో విశ్వక్ సేన్ తోపు అనే చెప్పాలి. అలాంటి హీరో నుంచి ఒక అఘోరా కథ వస్తోంది అనగానే అందరూ మొదట షాకయ్యారు. కానీ, సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. అయితే ఈ మూవీ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీమ్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. అలాగే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

గామి సినిమా కోసం విశ్వక్ సేన్ గత నాలుగున్నర సంవత్సరాలుగా కష్టపడుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీ డైరెక్టర్ కాగిత విద్యాధర్ అయితే ఏకంగా 8 ఏళ్ల నుంచి ఈ సినిమా నరేషన్ మీదే కూర్చొని ఉన్నాడు. ఒక డైరెక్టర్ ఒక సినిమా కోసం ఇంత సమయం కేటాయిస్తున్నాడు అంటే అతనికి కథ మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ నుంచి చిత్ర బృందం ఒక క్రేజీ అప్ డేట్ తీసుకొచ్చింది. మూవీ కోసం ఎంత కష్టపడ్డారో తెలిసేలా ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉంటే ఎంత కష్టమైనా వెనుకాడరు అనడానికి ఈ మేకింగ్ వీడియో ఒక ఉదాహరణ అని చెప్పచ్చు.

గామి కోసం భారీ సెట్స్ వేయడం మాత్రమే కాకుండా.. సముద్ర మట్టానికి 19 వేల అడుగుల ఎత్తులో, గడ్డకట్టించే -40 డిగ్రీల చలిలో సినిమా షూటింగ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చూసిన తర్వాత టీమ్ కష్టం తెలియడమే కాకుండా.. ఫ్యాన్స్ లో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం దీని గురించే మాట్లాడుకుంటుంది అంటూ విశ్వక్ కామెంట్స్ చేశాడు. అలాగే గామి సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. మార్చి 8న గామి సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయాన్ని విశ్వక్ సేన్ ప్రకటించాడు. అయితే అదే రోజున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈసారి కూడా ఆ మూవీ వాయిదా పడిన విషయాన్ని విశ్వక్ అధికారికంగా ప్రకటించాడు.

కాకపోతే మార్చి 8కి గామి సినిమాతో వస్తున్నాను అంటూ ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో రాకపోయినా.. గామితో వస్తున్నాను అంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా షేర్ చేసుకున్నాడు. కుంభమేళా సమయంలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు విశ్వక్ నిజంగానే అఘోరా అనుకుని దానం చేశారంట. చలిలో వణుకుతూ ఉన్న అతడిని చూసి అఘోరా అనుకుని ఒకావిడ టిఫిన్, చాయ్ ఇచ్చింది అని చెప్పాడు. ఆ విషయాలు జరిగిన తర్వాత తనని నిజమైన అఘోరా అనుకోవడం చూసి.. తన గెటప్ రియాలిటీకి దగ్గర ఉందని సంతోష పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి.. గామి సినిమా టీమ్ ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet